ఆంధ్రప్రదేశ్‌

ప్రజా ఉద్యమమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: పెద్దనోట్ల రద్దు వల్ల ప్రజలు పడుతున్న ఇక్కట్లపై విజయవాడ కేంద్రంగా ప్రజా ఉద్యమం చేపడతామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అత్యున్నత ప్రజావేదికైన పార్లమెంట్ వైపు కనె్నత్తి చూడకుండా తప్పించుకు తిరుగుతున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. నోట్ల రద్దు-ప్రజల ఇక్కట్లపై సోమవారం పిసిసి కార్యాలయంలో ‘మాట్లాడుకుందాం రండి’ పేరిట చర్చా కార్యక్రమం జరిగింది. న్యాయవాదులు, వ్యాపారులు, విద్యార్థులు, యువకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. చర్చావేదికలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన ఒత్తిళ్లకు దేశంలో ఇప్పటికి సుమారు 110 మంది సామాన్యులు, 12 మంది బ్యాంక్ ఉద్యోగులు మృతి చెందారన్నారు. వీరి మృతికి ప్రధాని మోదీ బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు. సామాన్యుల ఇళ్లలో పెళ్లిళ్లు వాయిదా పడ్డాయన్నారు. అయితే బిజెపి నేతలు, మంత్రుల ఇళ్లల్లో మాత్రం వందల కోట్ల రూపాయల వ్యయంతో ఘనంగా పెళ్లిళ్లు జరిగాయని ఆయన విమర్శించారు. మోదీకి మానవ హక్కులపై, ప్రజాస్వామ్యంపై ఎప్పుడూ నమ్మకం లేదని, తానేదో రాచరికంలో వున్నానని భావిస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. నోట్ల రద్దు వెనుక ఎంతటి భారీ కుంభకోణం ఉందో త్వరలో బయటపడుతుందన్నారు. ఇందులో చంద్రబాబు పాత్ర, ఆయన భయం ఏమిటో కూడా బయటకు వస్తుందన్నారు. వివిధ వర్గాల అభిప్రాయాలపై ఇక ప్రజా ఉద్యమాన్ని చేపడతామని రఘువీరారెడ్డి వివరించారు.