ఆంధ్రప్రదేశ్‌

టిడిపి కౌన్సిలర్ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు, ఏప్రిల్ 1: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాల్టీలో 16వ వార్డు కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ (52) (టిడిపి) శుక్రవారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యారు. ఒక వివాహ విందుకు హాజరై ద్విచక్ర వాహనంపై వస్తున్న ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడిచేశారు. ఈ ఘటనలో ఆయన రక్తపుమడుగులో అక్కడికక్కడే మృతిచెందారు. తెలుగుదేశం పార్టీకి చెందిన గోపాలకృష్ణ మూడుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. గోపాలకృష్ణకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ హత్య వార్త తెలిసిన వెంటనే కొవ్వూరు డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, పట్టణ సిఐ పి ప్రసాదరావు, ఎస్‌ఐ ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని, హత్య జరిగిన తీరును పరిశీలించారు.
కాగా గోపాలకృష్ణ గతంలో కొవ్వూరులోని ఇసుక రీచ్ నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఇందుకు సంబంధించిన విభేదాలేమైనా హత్యకు కారణమయ్యాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యోదంతంపై దర్యాప్తు వేగవంతం చేశామని, నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని డిఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలిపారు. కొవ్వూరు పట్టణ చరిత్రలో ఒక రాజకీయ నేత, అధికార పార్టీకి చెందిన వ్యక్తి హత్యకావడం ఇదే ప్రప్రథమం కావడంతో చర్చనీయాంశంగా మారింది.