ఆంధ్రప్రదేశ్‌

పంట నష్టం అపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు/ఒంగోలు, డిసెంబర్ 13: వార్ధా తుఫాన్ ముప్పు చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు తప్పినట్లు అయ్యింది. సోమవారం తుఫాన్ చిత్తూరు తూర్పు మండలాలను వణికించింది. ప్రకాశం జిల్లాలో కందుకూరు డివిజన్‌లో భారీవర్షాలు కురిశాయి. మంగళవారం మధ్యాహ్నంనుంచి క్రమేణా ఈ ప్రభావం తగ్గిపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తుఫాన్ కారణంగా భారీ గాలులతో పలుచోట్ల విద్యుత్ స్తంబాలు విరిగిపోవడంతో చంద్రగిరి, నాగలాపురం మండలాల్లో విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు మృతి చెందారు. అనేక చోట్ల చెట్లు విరిగి పడ్డాయి. తూర్పు మండలాల్లో కుండపోత వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. తుఫాన్ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని ముందస్తు చర్యలు చేపట్టి జిల్లా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు తుఫాన్ ప్రభావం మంగళవారం నాటికి క్రమేణా తగ్గిపోవడంతో అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చంద్రగిరి మండలం పనపాకం సమీపంలోని అరికిరివారిపల్లికి చెందిన దొరబాబు,నాగలాపురం మండలంలో ఒకరు మృత్యువాత పడ్డారు. నగరి మండలం మాంగాడులో గాలుల తాకిడికి ఇంటిపైకప్పు కూలి పోవడంతో ముగ్గురికి తీవ్ర గాయాలైయ్యాయి. తొట్టంబేడు మండలం విరుపాక్షిపురంలో రెండు బర్రెలు మరణించాయి. శ్రీకాళహస్తి, వరదయ్యపాళ్యం, నాగలాపురం, ఏర్పేడు, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఈదురు గాలుల తాకిడికి సుమారు వంద చెట్లకు పైగా నేలకొరిగాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా 11కెవి విద్యుత్ స్థంబాలు 437, ఎల్ టి పోల్ 508 విరిగి పడిపోవడంతో అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా స్థంబించింది. మంగళవారం అధికార యంత్రాంగం రోడ్లపై విరిగి పడిన చెట్లను తొలగించడంతో పాటు విద్యుత్‌ను పునరుద్దరించే పనిలో పడ్డారు. ప్రకాశం జిల్లాలో కందుకూరు డివిజన్‌పై వార్ధా ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరియాయి. జిల్లాలో శనగ, మినుము పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సోమవారం అర్ధరాత్రి నుండి మంగళవారం మధ్యాహ్నం వరకు కందుకూరు డివిజన్‌లోని పలుప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండంగా, మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. తుఫాన్ ప్రభావం ప్రధానంగా కందుకూరు డివిజన్‌పైనే చూపింది. దీంతో కందుకూరు -కావలి మధ్య ఉన్న కొండముడుసుపాలెం రోడ్డుపక్కన చెట్లు పడిపోయాయి. భారీ వర్షానికి తోడు ఈదురుగాలులు కూడా వీయడంతో ఆయాప్రాంతాల్లో సాగుచేసిన మినుము, శనగ పంటలకు నష్టం జరగటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.