ఆంధ్రప్రదేశ్‌

పింఛను కోసం క్యూలో నిలబడి గుండెపోటుతో వృద్ధుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 13: వృద్ధాప్యపు పింఛను కోసం క్యూలో నిలబడి, గుండెపోటుతో ఒక వృద్ధుడు మృతిచెందాడు. జంగారెడ్డిగూడెం మండలం కేతవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కియోస్క్ వద్ద మంగళవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి... కేతవరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కియోస్క్ బ్యాంకింగ్ ఉండటంతో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు చెల్లిస్తున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో క్యూలైన్‌లో సుమారు 30, 35 మంది వరకు నిల్చునివున్నారు. క్యూలైన్‌లో చాలాసేపటిగా వేచి ఉన్న బొర్రా వెంకటరావు(65)కు గుండెపోటు రావడంతో అక్కడే పడిపోయాడు. తోటివారు స్పందించి ఆటోలో జంగారెడ్డిగూడెం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. దీంతో పలువురు పింఛనుదార్లు ఎస్‌బిఐ కియోస్క్ బ్యాంకింగ్ క్లర్క్ బి.శ్రీనివాస్‌ను నిలదీశారు. 25 మందికి పింఛన్లు అందజేసేసరికి తన వద్ద నగదు అయిపోయిందని, నగదు కోసం తాను బ్రాంచ్‌కి వెళ్ళడం వల్లే జాప్యం జరిగిందని వివరించాడు.