ఆంధ్రప్రదేశ్‌

కోస్తాకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 13: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వార్ధా తుపాను అల్పపీడనంగా మరింత బలహీన పడి, ఇంటీరియల్ కర్నాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. ఇది పూర్తిగా బలహీన పడినట్టేనని పేర్కొన్నారు. అయితే దక్షిణ కోస్తాలో ఇంకా పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తర కోస్తాలో కూడా ఒకటి, రెండు చోట్ల జల్లులు కురుస్తాయన్నారు. అయితే తీరం వెంబడి తూర్పు, ఈశాన్య దిశల నుంచి గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.