ఆంధ్రప్రదేశ్‌

పంచాయతీలకు సొంత భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, డిసెంబర్ 13: రాష్ట్రంలో పంచాయతీ రాజ్ సంస్థలకు నిర్వహించే ఎన్నికలను మూడంచెల పద్థతిలో నిర్వహించాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మంగళవారం విశాఖ జిల్లా సబ్బవరం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చట్టాన్ని సవరించి ఐదంచెల పద్థతి ప్రవేశపెట్టారని, కానీ తద్వారా ఏర్పడిన ఎంపిటిసి వ్యవస్థకు ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అందుకని త్వరలో మళ్ళీ చట్టసవరణ చేసి మూడంచెల పద్ధతి తీసుకొస్తామన్నారు. రాష్ట్రంలో మొత్తం 13వేల పంచాయతీలు ఉండగా అందులో 4, 600 పంచాయతీలకు మాత్రమే సొంత భవనాలున్నాయన్నారు. మిగిలిన అన్ని పంచాయతీలకు సొంత భవనాల కోసం 15 లక్షల రూపాయల చొప్పున నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ నిధులను 1.50 లక్షలు పంచాయతీలు భరిస్తే 13.50 లక్షలు ప్రభుత్వం ఉపాధి నిధుల నుంచి ఖర్చుచేస్తుందన్నారు. విశాఖ జిల్లాలో 180 పంచాయతీ భవనాలు నిర్మించామన్నారు. రాష్ట్రంలో 3500 శ్మశాన వాటికలకు నిధులు మంజూరు చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన అంగన్‌వాడీ కేంద్రాలకు 7,500 భవనాలు పూర్తిచేస్తున్నామన్నారు.