ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి రింగ్‌రోడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 14: సిఆర్‌డిఎ పరిధిలో చుట్టూ ఉన్న పట్టణాలు, జాతీయ రహదారులను అనుసంధానం చేసేలా ఔటర్ రింగ్‌రోడ్ నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రజా రాజధాని ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని అంతర్, బాహ్య వలయ రహదారులు ఉండాలని చెప్పారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ వారాంతపు సమీక్షా సమావేశం ప్రధానంగా అంతర్, బాహ్య వలయ రహదారులపైనే సాగింది. ఈ రహదారులకు సంబంధించి సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ మూడు ఆప్షన్లను సిఎం ముందుంచారు. రాజధాని పరిధిలో చుట్టూ ఉన్న పట్టణాలు, జాతీయ రహదారులను కలిపేలా బాహ్య వలయ రహదారి నిర్మాణం ఉండాలని, రెండు రోజులలో దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసి ఇస్తే త్వరలో జరిగే శాఖాధిపతుల సమావేశంలో మంత్రిమండలి సమావేశంలో చర్చించి తుది నిర్ణయానికి రావచ్చునని ముఖ్యమంత్రి చెప్పారు.
తెనాలి, గుడివాడ, నూజివీడు, సత్తెనపల్లి వంటి పట్టణాలతో పాటు చెన్నయ్-కలకత్తా జాతీయ రహదారి, విజయవాడ-ముంబై జాతీయ రహదారి, విజయవాడ-జగదల్‌పూర్ జాతీయ రహదారితో పాటు కొత్తగా నిర్మించబోయే అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్ రహదారికి అనుసంధానంగా ఉండేలా ప్రజారాజధానిలో బాహ్య వలయ రహదారి ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. బాహ్య వలయ రహదారి నిర్మాణం జరిగితే చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ అభివృద్ధి చెంది అవన్నీ కాలగమనంలో రాజధాని నగరంలో కలిసిపోతాయని వివరించారు. రానున్న కాలంలో రాజధాని ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్స్ అభివృద్ధి చెందుతాయని అన్నారు. బాహ్య వలయ రహదారిపై తుది ప్రణాళిక సిద్ధమైతే దీనిపై సవివర ప్రాజెక్టు నివేదికను తయారుచేసి కేంద్రానికి అందాంచాల్సి ఉంటుందని చెప్పారు. బాహ్య వలయ రహదారి లోపల ప్రస్తుతం ఉండే జనాభా 30 నుంచి 35 లక్షల వరకు ఉంటుందని, ఇది 1995లో ఇది హైదరాబాద్ జనాభా అని గుర్తు చేశారు. రాజధాని పరిధిలోని రెండు ప్రధాన నగరాలు, చుట్టూ ఉండే పట్టణాలు, కొత్తగా వచ్చే శాటిలైట్ టౌన్‌షిప్‌లకు 30 లేదా 45 నిమిషాల వ్యవధిలో చేరుకునేలా రవాణా వ్యవస్థ వస్తుందన్నారు. అంతర్ వలయ రహదారి నుంచి నగరానికి దారితీసే అంతర్గత రహదారులన్నీ మలుపులు లేకుండా నేరుగా ఉండాలని సూచించారు. అమరావతి నిర్మాణంతో పాటే చుట్టూ ఉన్న తెనాలి, మంగళగిరి, సత్తెనపల్లి, నూజివీడు, గుడివాడ, మచిలీపట్నం, తాడేపల్లి వంటి ప్రాంతాలలో సమాంతర అభివృద్ధి జరగాలని, అధికారులు దీనిపై ఇప్పటినుంచే తగిన కార్య ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. రాజధాని పరిధిలో భూసమీకరణ ప్రక్రియ మొత్తం డిసెంబర్ నెలాఖరులోగా ముగుస్తుందని, రెండు గ్రామాలు మినహా దాదాపు అన్నిచోట్ల ప్లాట్ల కేటాయింపు పూర్తవుతుందని సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ తెలిపారు. అంతర్జాతీయ విద్యాలయాల కోసం టెండర్లు పిలవగా పేరొందిన సంస్థలు ఆ ప్రక్రియలలో పాల్గొన్నాయని చెప్పారు. ప్రపంచంలో పేరొందిన మొదటి 10 అక్రిడేటెడ్ విద్యాసంస్థలతో సంప్రదింపులు జరిపి అమరావతిలో వారు తమ శాఖలను నెలకొల్పుకునేలా అన్ని అవకాశాలను కల్పిద్దామని ముఖ్యమంత్రి చెప్పారు. ముందు విద్యాలయాలు, కళాశాలలు, ఆస్పత్రులు, నక్షత్ర హోటళ్ళు వస్తే నగరాభివృద్ధి శరవేగంతో జరుగుతుందని అన్నారు. అమరావతిలో నిర్మాణాలు ప్రారంభించాలని హిల్టన్, మారియట్, లీలా గ్రూపు వంటి అంతర్జాతీయ సంస్థలను కోరాలని సూచించారు. షెట్టీ గ్రూపు, అమృత, విట్ వంటి ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు ఇప్పటికే వచ్చాయని అధికారులు వివరించారు. రాజధానిలో జస్టిస్ సిటీ, ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి నవ నగరాల అభివృద్ధిపై ఇక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుపై అంతర్జాతీయంగా పేరొందని సంస్థలతో మాట్లాడాలని కోరారు. రానున్న కొద్దికాలంలో జాతీయ క్రీడలకు అమరావతి వేదికగా నిలిచేలా స్పోర్ట్స్ సిటీని సిద్ధం చేయాలన్నారు. వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న శాసనసభ, శాసనమండలి భవనాల నిర్మాణాలు మరో నెల రోజుల వ్యవధిలో పూర్తవుతాయని సిఆర్‌డిఎ అధికారులు చెప్పారు. సచివాలయం లోపల సుందరీకరణ పనులు పూర్తి కావొస్తున్నాయని, పార్కు నిర్మాణం 70 శాతం పూర్తయిందని తెలిపారు. విజయవాడ నగర సుందరీకరణ పనులు కూడా సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నగర కమిషనర్ వీరపాండియన్‌ను ఆదేశించారు. ఆలస్యం లేకుండా కెనాల్ డెవలప్‌మెంట్ పనులు ఆరంభించాలని చెప్పారు. సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, రాజధాని నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి సిఎండి లక్ష్మీపార్ధసారథి, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు