ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 15: ప్రభుత్వం అన్ని అంశాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తోంది.. అయితే అధికారులు కొన్ని సందర్భాలలో చెడ్డపేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు.. సైంటిఫిక్ అప్రోచ్ కొరవడింది.. ఇళ్ల స్థలాలు..పెన్షన్లు..రుణమాఫీ..చేస్తున్నా ప్రజల్లో విస్తృత ప్రచారం జరగడంలేదు..విశ్వసనీయత పెంచుకునే దిశగా ప్రణాళికలు రూపొందించాలని సిఎం చంద్రబాబు మంత్రులు, అధికారులకు క్లాస్ పీకారు. గురువారం వెలగపూడి సచివాలయంలో ఉన్నతాధికారులు, మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఇదే విషయాలను ప్రస్తావించారు. ప్రభుత్వానికి ఇన్‌ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ విభాగాలు ఉన్నాయి.. ఏ ఉద్యోగి ఎక్కడ ఎలా పనిచేస్తున్నారు.. ప్రభుత్వ కార్యక్రమాల పట్ల ప్రజల్లో స్పందన ఎలా ఉందనే విషయాలతో పాటు అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో 80 శాతం ప్రజలను భాగస్వామ్యం చేస్తేనే సత్ఫలితాలు సాధించగలమని ఉద్ఘాటించారు. కొందరు అవినీతి సిబ్బంది కారణంగా వ్యతిరేక సంకేతాలు వస్తున్నాయని హెచ్చరించారు. సీడ్ కేపిటల్ నిర్మాణాలకు త్వరితగతిన డిజైన్లు పూర్తయ్యేలా చూడాలన్నారు. దీనిపై సీఆర్డియే అదనపు కమిషనర్ అజయ్‌జైన్, కమిషనర్ చెరుకూరి శ్రీధర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేశారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి జపాన్‌కు చెందిన మాకీ అసోసియేట్స్‌తో ఒప్పందం రద్దయిన కారణంగా వారంలోగా తిరిగి గ్లోబల్ టెండర్లు పిలవాల్సి ఉందన్నారు. విజయవాడ, గుంటూరు, తెనాలిని అంతర్గతంగా కలుపుతూ 186 కిలోమీటర్ల బాహ్య వలయ రహదారితో రాజధాని ప్రాంతంలో టౌన్‌షిప్‌లు అభివృద్ధి చెందుతాయని ప్రతిపాదించారు. 210 కిలోమీటర్ల రహదారి వల్ల అది సాధ్యపడదని చెప్పారు. దీంతో 98 కిలోమీటర్ల ఇన్నర్ రింగురోడ్డుతో పాటు 186 కిలోమీటర్ల బాహ్యవలయ రహదారికి సిఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మూడేళ్లలో పూర్తిచేయాలని గడువు పెట్టారు.