ఆంధ్రప్రదేశ్‌

ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 15: రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యాన ఈ నెల 27, 28, 29 తేదీల్లో నెల్లూరు జిల్లాలో ఫ్లెమింగో ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్‌లో ఫ్లెమింగో ఫెస్టివల్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, నేలపట్టు, అటకానితిప్ప, భీమునివారిపాలెంలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చంద్రబాబు మంత్రులు, అధికారులతో సమీక్షించారు. సమావేశంలో మంత్రులు నారాయణ, శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.