ఆంధ్రప్రదేశ్‌

నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 15: పోలీసుశాఖలో తొలి నగదు రహిత లావాదేవీలకు విజయవాడ పోలీసు కమిషనరేట్ శ్రీకారం చుట్టింది. ఇది రాష్ట్రంలోనే తొలి ప్రయోగాత్మకంగా నగర పోలీసుశాఖ ప్రవేశపెడుతోంది. ఈమేరకు పలు బ్యాంకులు, ఆర్ధిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. పోలీసుశాఖ నుంచి ప్రజలకు అందిస్తున్న 52రకాల సేవల కోసం వసూలు చేసే ఛార్జీలు, రుసుము ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు కొనసాగనున్నాయి.
అయితే ఈ విధానం పట్ల సామాన్య ప్రజల్లో సైతం అవగాహన అవసరమని నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్, వివిధ ఆర్ధిక సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. వివిధ సేవల ద్వారా నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో రూ.3.5కోట్ల నుంచి 4కోట్ల వరకు నగదు లావాదేవీలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఒక్క జరిమానా రూపంలోనే రూ.2.5కోట్ల నుంచి రూ. 3కోట్ల వరకు వసూలవుతున్నాయి. ఇవే కాకుండా యుపిఎస్‌సి ద్వారా అందించే సేవలకు సంబంధించి వివిధ రకాల అనుమతులు, వాహనాలు, ఇతరత్రా నిరభ్యంతర ధృవీకరణ పత్రాలు, ఆర్టీఐ, ఆయుధ లైసెన్స్‌లు, మైకు అనుమతులకు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంది. ఇకపై ఈ సేవలన్నీంటికీ కూడా వసూలు చేసే ఛార్జీలు ప్రజలు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
ఇదిలావుండగా మరోవైపు పోలీసుశాఖలోని సిబ్బంది కోసం నిర్వహిస్తున్న కో ఆపరేటివ్ స్లోర్స్‌ల్లో కూడా నగదు రహిత లావాదేవీలు ప్రారంభం కానున్నాయి. కాగా.. నగదు రహిత లావాదేవీల పట్ల ప్రజల్లో.. ముఖ్యంగా సామాన్యులకు అవగాహన కలిగించాల్సి ఉందని, ఇందుకోసం తొలి అడుగుగా.. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. కాగా కమిషనరేట్‌లో పోలీసుశాఖ, బ్యాంకులు మధ్య శుక్రవారం కుదుర్చుకున్న ఒప్పందం కార్యక్రమంలో సీపి గౌతం సవాంగ్‌తోపాటు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ జివి శాస్ర్తీ, అసిస్టెంట్ మేనేజర్ చిట్టిబాబు, యాక్సిస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధి శివప్రసాద్, పేటిఎం ప్రతినిధి హరిప్రసాద్, బిల్‌డెస్క్ ప్రతినిధి మధు, నేషనల్ పేమెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి భవ్య, డిసిపిలు జివిజి అశోక్‌కుమార్, జి పాలరాజు, కాంతి రానాటాటా తదితరులు పాల్గొన్నారు.