ఆంధ్రప్రదేశ్‌

ఎవరి మెహర్బానీ కోసం...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 15: కేంద్రప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య, మధ్యతరగతి జనం పడుతున్న కష్టాలకు అంతూపొంతూ లేకుండా పోతోంది. అయితే ఈనిర్ణయం తర్వాత ‘ప్రశాంతంగా’ వ్యాపారం చేసుకునే రేషన్ డీలర్ల పరిస్ధితి కుడితిలో పడ్డట్టు అయింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వీరిపాలిట ఒకరకంగా శాపంగా మారుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ ఈ కథాకమామిషు లోతుకు వెళితే... కేంద్రం పెద్దనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవటం, ఆ తర్వాత నోట్ల కష్టాల్లో జనం మునిగిపోవటం తెల్సిందే. దీనినుంచి ఉపశమనంగా, తనవంతు చొరవగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారికి రేషన్ షాపుల్లో అరువుపై సరుకులు తీసుకోండని ప్రకటించేసింది. అయితే ఇక్కడే అసలు మతలబు అంతా చోటుచేసుకుంది. డీలర్ల దగ్గరనుంచి రేషన్‌కు సంబంధించి మొత్తాలను వసూలుచేసిన ప్రభుత్వం ఆ సరుకులను మాత్రం కార్డుదారులకు అరువుపై ఇవ్వాలని చెప్పడంతో ఈ నెల మొదట్లోనే డీలర్లు అసంతృప్తి, ఆందోళన, ఆవేదన వ్యక్తంచేశారు. ఎలాగోలా ఆ పరిస్థితి సర్దుమణుగుతోందన్న తరుణంలో ఇప్పుడు ‘్ఛయ’రూపంలో తమపై మరో దాడి సిద్ధమైందని డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. మావల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. ఇంతకీ ఈవ్యవహారం ఏమిటంటే రేషన్‌షాపుల్లో కార్డులపై ఇచ్చే సరుకులే కాకుండా కందిపప్పు, నెయ్యి, ఇతరత్రా సరుకులు కూడా సరసమైన ధరలకు అందిస్తూ వస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు షాపుల చరిత్రలో లేనివిధంగా మినపగుళ్లను ఈ జాబితాలోకి అర్జంటుగా చేర్చేశారు. దీనివెనుక ఆంతర్యం సంగతి అలా ఉంచితే అసలు ఈ గుళ్లను రేషన్‌షాపుల్లో ఎలా అమ్మాలి అన్న ప్రశ్న సహజంగానే డీలర్లలో తలెత్తింది. అ అంశాన్ని కూడా పక్కనపెడితే ఇంతకీ వచ్చిన గుళ్లను చూస్తే డీలర్ల గుండె గుభేలుమంది. వచ్చిన గుళ్లను చూసి డీలర్లు ఇచ్చిన రేటుకు, ఖాతాదారులకు అమ్మాల్సిన రేటుకు అంతరాలను చూస్తే డీలర్లు అంతా ఇదెక్కడి ఫిటింగ్ అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇంతకీ వచ్చిన గుళ్లు చాలాచోట్ల నాసిరకంగా భావించే ఛాయమినపగుళ్లు. ఇవి సాధారణంగా మనలాంటి ప్రాంతాల్లో మినపపప్పు స్థానంలో తక్కువగా వినియోగిస్తారు. మినపపప్పు కన్నా వీటి రేటు తక్కువగానే ఉంటుంది. దీనికితోడు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఈ ఛాయమినపగుళ్లకు డీలర్లు కేజీకి రూ.126 చొప్పున ముందుగానే చెల్లించాలని, అవిధంగా కొన్న మినపగుళ్లను కార్డుదారులకు మాత్రం రూ.96కు విక్రయించాలని సివిల్ సప్లయిస్ అధికారులు హుకుం జారీచేశారు. వాస్తవానికి ఛాయమినపపప్పు వాడతారేమోగాని, మినపగుళ్లు ఈప్రాంతాల్లో ఎవరు వినియోగిస్తారని, దీనికితోడు కిలోకు రూ.30 తేడాలో కార్డుదారులకు విక్రయిస్తే ఆ సొమ్ము తమకు ఎవరూ ఇస్తారని డీలర్లు అధికారులను ప్రశ్నించారు. ఆ మొత్తాలను డీలర్ల ఖాతాల్లో సరిచేస్తామని వారు చెప్పడంతో హతాశులయ్యారు. అసలు ఈ మినపగుళ్లు ఎవరు అడిగారు, ఇంతకాలం లేని సరుకును ఈ జాబితాలో ఎందుకు చేర్చారు, చేర్చినా కొన్న రేటుకు రూ.30 తగ్గించి అమ్మడం ఏమిటి, తేడా మొత్తాన్ని ఖాతాల్లో సరిచేయటం ఏమిటో అర్ధంకాక డీలర్లు తలలు పట్టుకున్నారు. ఇప్పటికే అరువుపై సరుకులు ఇస్తామంటూ భారీగా ప్రకటనలు చేసి సరుకులకు మాత్రం మా దగ్గర సొమ్ములు వసూలు చేసి కార్డుదారులకు అరువుపై ఇప్పించారని, అవిధంగా పేరుకున్న మొత్తమే తడిసిమోపేడైతే ఇప్పుడు గుండెలపై భారంగా మారే ఈ ఛాయ మినపగుళ్ల బస్తాలను మీద పడేస్తే భరించలేమంటూ డీలర్లు దాదాపుగా చేతులెత్తేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో దాదాపుగా అన్నిచోట్ల లాజిక్ మాత్రం మిస్ అవుతూనే ఉంది. ఎక్కువ ధరకు కొని తక్కువ ధరకు అమ్మడం ఏమిటో, అసలు ఎవరూ అడగని ఛాయమినపగుళ్లు సివిల్ సప్లయిస్ అధికారులు అంటగట్టడమేమిటో చూస్తుంటే దీనివెనుక భారీ మంత్రాంగం నడిచిందా, లేక భారీగా చేతులు మారాయా, ఎక్కడైనా మారని సరుకును అంటగడుతున్నారా అన్న సందేహాలు సహజంగానే విన్పిస్తున్నాయి. గత రెండు నెలల్లో మినపపప్పు ధరలు అమాంతం తగ్గుతూ వస్తున్నాయి. రెండు నెలల క్రితం కేజీ 130 నుంచి 140 రూపాయల ధర ఉండగా ఇప్పుడు ఆ ధర రూ.80కు పడిపోయింది. ఈపరిస్ధితుల్లో బహిరంగమార్కెట్‌లో కేజీ మినపపప్పు రూ.80కు దొరుకుతుంటే నెంబర్ 3 రకంగా ఉన్న నాసిరకం ఛాయమినపగుళ్లను 85 రూపాయలకు అమ్మడం ఏమిటంటూ డీలర్లే ప్రశ్నిస్తున్నారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాలను తూచ తప్పకుండా పాటించే జిల్లా అధికారులు ఏదోవిధంగా సరుకును అమ్మాలంటూ డీలర్లను బతిమాలుతున్నారు. ఈసారికి మా మాట నిలబెట్టడంటూ ప్రాధేయపడుతున్నారు.