ఆంధ్రప్రదేశ్‌

సమాజంకోసం ఆలోచించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 16: సమాజానికి ఉపయోగపడే విధంగా వినూత్నంగా ఆలోచించినప్పుడే విద్యకు సార్థకత చేకూరుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం తిరుపతిలో రూ.182.11 కోట్లవ్యయంతో స్విమ్స్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి మహిళా వైద్యవిద్య కళాశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం వైద్య కళాశాల విద్యార్థినులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 25-37 సంవత్సరాలులోపు ఎవరైనా వినూత్న ఆలోచనలు చేయగలరన్నారు. ఈక్రమంలో 18 సంవత్సరాల వయస్సులో వైద్య విద్యలోకి అడుగుపెట్టిన మీరందరు వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టాలన్నారు. అవి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో సిలికాన్ సిటీ కన్నా ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో ఉంచాలన్నది తమ లక్ష్యమన్నారు. అమెరికాలో ఉన్న డాక్టర్లు కన్నా భారతదేశంలో ఉన్న డాక్టర్లు గొప్ప పరిజ్ఞానం ఉన్నవారని చెప్పారు. బ్రెయిన్ డ్రైయిన్ అనే మాట నేడు ఉందన్నారు. అదే అంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న ఆధునిక సాంకేతిక విజ్ఞాన వినియోగంతో డ్రైయిన్ కం బ్యాక్ అనే మాట వింటారన్నారు. అమెరికా వెళ్ళినవారంతా తిరిగి భారతదేశానికి వస్తారన్నారు. స్విమ్స్‌డైరెక్టర్ రవికుమార్ భారతదేశంలో వైద్య విద్యను నేర్చుకుని అమెరికాకు వెళ్ళి తిరిగి వచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. స్విమ్స్‌ను అంతర్జాతీయ స్థాయిలో 10వ స్థానంలో ఉంచాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. నాడు ఎన్‌టి ఆర్ మహిళల కోసం ప్రత్యేక విశ్వవిద్యాలయం పెట్టారని తాను ప్రత్యేకంగా వైద్య కళాశాలను ఏర్పాటు చేశానని తెలిపారు. జనవరిలో తిరుపతిలో జరుగనున్న ఇస్కా సమావేశాలు అదే సమయంలో మహిళ విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న చిల్డ్రన్ సైన్స్ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

నోట్ల మార్పిడికి పాల్పడిన
పోస్టల్ సిబ్బందిపై కేసు

విశాఖపట్నం, డిసెంబర్ 16: నోట్ల రద్దు అనంతరం కొత్త రూ.2000 నోట్లను అక్రమంగా మార్చిన ఇద్దరు పోస్టల్ సిబ్బందిపై సిబిఐ కేసు నమోదు చేసింది. విశాఖ ఆంధ్రాయూనివర్శిటీ కేంపస్ సబ్ పోస్ట్ ఆఫీస్‌లో రూ.21.73 లక్షల మేర నోట్ల మార్పిడిలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు నిర్ధారించిన అనంతరం వీరిపై సిబిఐ కేసు నమోదు చేసింది. నోట్ల రద్దు అనంతరం ప్రభుత్వ రంగ ఉద్యోగులపై సిబిఐ, ఎసిబి నిఘా ఉంచింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎయు సబ్ పోస్ట్ఫాసులో నోట్ల మార్పిడిలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు అందిన సమాచారం మేరకు ఎసిబి, సిబిఐ సంయుక్తంగా సోదాలు నిర్వహించింది. సబ్ పోస్టు మాస్టర్ కె లలిత, ట్రెజరర్ ఎస్ శ్యామ్యూల్ జాన్సన్‌లు ఉద్దేశ పూర్వకంగా నోట్లను మార్చినట్టు నిర్ధారించారు. నోట్ల రద్దు అనంతరం వీరు రూ 21.73 లక్షల నగదును ఎటువంటి ఆధారాలు లేకుండా మార్చినట్టు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసినట్టు సిబిఐ ఎసిబి సూపరింటెండెంట్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. అవినీతి, ప్రభుత్వ రంగ సంస్థల్లో అక్రమాలపై ప్రజలు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ ఎబివిపి అధ్యక్షుడిగా
డాక్టర్ చెన్న కృష్ణారెడ్డి
కార్యదర్శిగా ఎల్ అయ్యప్ప ఎన్నిక

హైదరాబాద్, డిసెంబర్ 16: ఎబివిపి తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా డాక్టర్ చెన్న కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శిగా ఎల్ అయ్యప్ప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి మసాడి బాపురావు ఒక ప్రకటన విడుదల చేశారు. డిసెంబర్ 24 నుండి జరిగే ఎబివిపి జాతీ య మహాసభల్లో వీరు బాధ్యతలు చేపడతారు. చెన్నకృష్ణారెడ్డి మెదక్ జిల్లాకు చెందిన వారు కాగా, ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలోని సమస్యలు, అధ్యాపకుల నియామకాలు, విసిల రిక్రూట్‌మెంట్, మెస్ ఛార్జీల కోసం జరిపిన విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. అయ్యప్ప పాలమూరు జిల్లాకు చెందిన వారు. ప్రస్తుతం ఎల్‌బి నగర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎమ్సెట్ కుంభకోణం బయటకి తీయడంలో క్రియాశీల పాత్ర పోషించారు. అలాగే నీట్ సీట్ల కేటాయింపులో అవకతవకలపై కూడా ఉద్యమించారు.