ఆంధ్రప్రదేశ్‌

గిరిజన పాఠశాలల కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 16: కాకులు దూరని కారడివి.. చీమలు దూరని చిట్టడివిగా జీవనం సాగించే గిరిజనుల్లో వెలుగు నింపేందుకై దివంగత ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన ఆశ్రమ పాఠశాలల్లో గత 14 ఏళ్లుగా ఎదుగు బొదుగూ లేక నామమాత్రపు జీతాలతో కాలం వెళ్లదీస్తున్న రాష్ట్రంలోని 1520 మంది కాంట్రాక్టు పాఠశాల ఉపాధ్యాయులకు ఓ శుభవార్త.. వీరందరికీ రెట్టింపు కాదు.. రెండు రెట్లు జీతాల పెంపుకు సానుకూలత వ్యక్తం చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదనలు పంపించారంటూ తెదే పార్టీకి చెందిన శాసనమండలి సభ్యులు ఎఎస్ రామకృష్ణ వెల్లడించారు. దీనిపై ఇప్పటికే తాను వాస్తవాలను వివరించినందున త్వరలోనే సిఎం ఆమోదంతో జీవో వెల్లడి కాగలదన్నారు. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆరు నుంచి 10 తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు ఇప్పటివరకు నెలకు రూ.5,500, ప్రాథమిక పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులకు రూ.4000లు మాత్రమే వస్తోంటే ఈ జీతాలు ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. అసలు ఉపాధ్యాయులు ఉత్సాహంగా బోధనపై దృష్టి సారిస్తే కదా విద్యార్థుల్లో విజ్ఞానం పెరిగేది అన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో తాము అనేకమార్లు జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయన్నారు.
ఈ కారణంచేత హైస్కూలు ఉపాధ్యాయులకు రూ.14వేల 860, పాఠశాల ఉపాధ్యాయులకు రూ.10వేల 900 పెంచటానికి ఆమోదం తెలుపుతూ సిఎం కార్యాలయానికి ప్రతిపాదనలు వెళ్లాయంటున్నారు. రాష్ట్రంలో 2010 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉంటే వీటిలో 8,059 మంది పిల్లలు వున్నారని నేటికీ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగానే వుందన్నారు.
రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో వున్నప్పటికీ చంద్రబాబు విద్యారంగానికి పెద్దపీట వేస్తూ మొత్తం బడ్జెట్‌లో 17.5 శాతం అంటే రూ.21వేల 500 కోట్లు కేటాయించారని అన్నారు. అసలు ఏ ఒక్క పోరాటం.. లాఠీదెబ్బ, ధర్నాలు కనీసం విజ్ఞప్తి కూడా లేకుండానే ఉపాధ్యాయులకు 43 శాతం మేర జీతభత్యాలు పెంచారని అన్నారు. అలాంటి వ్యక్తి బాబు రాష్ట్రంలోని 6వేల మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేయకపోతారాయని ప్రశ్నించారు. దీనిపై తాను ఇప్పటికే మంత్రి గంటాతో చర్చించి తర్వాత సంబంధిత సంఘాలకు లిఖితపూర్వక హామీనిచ్చినప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు వారితో నిరవధిక సమ్మె చేయిస్తూ విద్యార్థులను ఇబ్బంది పాలు చేస్తున్నారని అన్నారు. అసలు వీరెవరికీ ఈ సమస్య పరిష్కారం కావటం ఇష్టం లేదంటూ అధ్యాపకుల్లో అసంతృప్తి పెరిగితే తమ పబ్బం గడుస్తుందనుకుంటున్నారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేయాలంటూ నినాదాలిస్తున్నారంటూ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేసారు. వాస్తవానికి తన జోక్యంతోనే ఈ కాంట్రాక్టు లెక్చరర్లకు రెన్యువల్ జరిగిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాల్లో అలాగే స్వాగత కార్యక్రమాల్లో పాఠశాల విద్యార్థులను బలవంతంగా తరలించకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని ఓ ప్రశ్నకు సమాధానంగా రామకృష్ణ అంగీకరించారు. వాస్తవానికి దీనివల్ల విలువైన తరగతులను కోల్పోతున్నారని అన్నారు. అసలు దీనిపై సిఎంతో కూడా తాను చర్చించి ఓ జీవో జారీ చేయించగలనన్నారు. ఈ సమావేవంలో తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొనకళ్ల రెడ్డిమ్మ, తలశిల శ్రీనివాసరావు, గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు ఎలీషాబాబు, కార్యదర్శి టి.జోసెఫ్ పాల్గొన్నారు.