ఆంధ్రప్రదేశ్‌

5 జిల్లాల్లో అనావృష్టి నివారణ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ అనావృష్టి నివారణ పథకం కింద ఐదు జిల్లాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరుతో పాటు ప్రకాశం జిల్లాలో 1.65 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలపై ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో సమీక్ష జరిగింది. ఐదేళ్ల కాలపరిమితితో ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి (ఐఎఫ్‌ఎడి), జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు), గ్రీన్ క్లైమేట్ ఫండ్ సంస్థలు ఆర్థిక సహకారాన్ని అందిస్తాయి. ఇందులో భాగంగా రూ. 500 కోట్ల మంజూరుకు ఐఫాడ్ ఆమోదం తెలిపింది. నాబార్డు, గ్రీన్‌క్లైమేట్, నరేగా నిధులు మరో 600 కోట్లతో ప్రాజెక్టును అమలులోకి తీసుకురానున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఆర్ అండ్ బి అతిథిగృహంలో మీడియాతో మాట్లాడుతూ ఈ పథకం లక్ష్యాలను వివరించారు. తీవ్ర వర్షాభావ, కరవు పరిస్థితులు నెలకొన్న జిల్లాలకు ఈ పథకాన్ని వర్తింప చేస్తారు. నూతన ఆలోచనలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఈ ప్రాజెక్టు ద్వారా జాతీయ, అంతర్జాతీయ పరిశోధన, ఉత్ప సంస్థలకు అవసరమైన వనరులను సమకూరుస్తారు. ప్రస్తుతం ఉన్న రైతు సంఘాలను బలోపేతం చేసి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారు. రైతు సమాచార కేంద్రాలు, పొలంబడి, పశు ఆరోగ్య కేంద్రాల్లో సేవలను విస్తృతం చేస్తారు. వర్షాధార, ప్రత్యామ్నాయ పంటలు, ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల నష్టాలు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో గ్రామస్థాయి సముదాయాలను ఏర్పాటుచేసి అందులో 70 శాతం వరకు 500 మంది రైతులు సగటు విస్తీర్ణం 1.5 హెక్టార్లకు లోబడి ఉండేలా బ్లాకులు ఏర్పాటు చేస్తారు. రెండు హెక్టార్లలోపు సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం కల్పిస్తారు. ఈ ఐదు జిల్లాల్లోని వర్షాధార ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించటం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యంగా మంత్రి తెలిపారు. కాగా గత ఏడాది ఇన్‌పుట్ సబ్సిడీగా 600కోట్లతో పాటు కర్నూలు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 75 కోట్లను వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జన్మభూమి కార్యక్రమం ద్వారా రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇవికాక మరో 435 కోట్ల మేర పంటల బీమా బకాయిలను ఒకే విడత చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 29.6 శాతం తక్కువ వర్షపాతం నమోదయినప్పటికీ వరిలో 30 నుంచి 35 బస్తాల దిగుబడి రావడంతో ఉత్పాదకత పెరిగిందన్నారు. రబీలో 24 లక్షల 63వేల హెక్టార్లలో సాగుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని దిగుబడి పెంచేందుకు ప్రణాళిక రూపొందించామని మంత్రి ప్రత్తిపాటి వివరించారు. వచ్చే సీజన్‌లోగా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ చెల్లింపులు పూర్తి చేస్తామన్నారు.