ఆంధ్రప్రదేశ్‌

కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంపై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 16: కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై జాతీయ పోరాటం చేపడతామని ఎపి ఎన్‌జివో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఆల్ ఇండియా గవర్నమెంట్ ఎంప్లారుూస్ అసోసియేషన్ జాతీయ సమావేశంలో శుక్రవారం అశోక్‌బాబు మాట్లాడుతూ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అమలు చేయడం వలన 2004 సంవత్సరం తరువాత నియమితులైన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సిసిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వచ్చినప్పటికీ సరైన స్పందన లేదన్నారు. సిసిఎస్ విధానాన్ని రద్దు చేసేలా దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులతో పాటు సేవలు అందిస్తున్నప్పటికీ వారికి ప్రభుత్వం చెల్లించే వేతనాలు అతి తక్కువగా వుంటున్నాయన్నారు. దేశంలోనే 29 రాష్ట్రాలకు చెందిన 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను, 80 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఒకే తాటిపైకి తీసుకురావలసిన బాధ్యత ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌పై వుందని అశోక్‌బాబు అన్నారు. సమావేశాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు వెయ్యి మందికి పైగా ప్రతినిధులు పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ నుండి 50 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.