ఆంధ్రప్రదేశ్‌

ఆగ్రహం... అసంతృప్తి...అభ్యర్థన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 16: పెద్ద నోట్లు రద్దయి నేటికి 40 రోజులు, సామాన్యులపై కేంద్రం సంధించిన రద్దు అస్త్రం తగలాల్సిన వారికి కాకుండా సామాన్యులకు వజ్రఘాతమయింది. ఫలితంగా రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న నోట్ల కష్టాలపై రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. వారిపై ఒక్కోసారి ఆగ్రహం... రోజూ అసంతృప్తి... మళ్లీ అంతలోనే అభినందన. ఆర్‌బిఐ, ఆర్థిక మంత్రికి రోజువారీ అభ్యర్థన. 40 రోజుల నుంచి ఉదయం మొదలు రాత్రి వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా బాబు కొనసాగిస్తున్న సమీక్షల తీరు ఇది.
పెద్దనోట్లను రద్దు చేసిన తరువాత సామాన్య ప్రజానీకం ఇబ్బందులకు గురికాకుండా కొత్తగా ముద్రించిన నోట్లను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిరోజూ సమీక్షలు నిర్వసిస్తూ నగదు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనివలన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కొంత మెరుగైన పరిస్థితి నెలకొన్నది. అయినప్పటికీ అక్కడక్కడా జరిగిన సంఘటనల వలన సామాన్య ప్రజానీకం ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదనే ఉద్దేశ్యంతో జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నది. కృష్ణా జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా ఇప్పటికే 4,480 కోట్ల రూపాయల పాత నోట్లను ఖాతాదారులు తమ తమ ఖాతాలలో వేయటంతో పాటు మార్చుకున్నారు. రిజర్వు బ్యాంకు నుండి సుమారు 2,400 కోట్ల రూపాయల కొత్త కరెన్సీ జిల్లాలోని 799 బ్యాంకు బ్రాంచీలకు పంపారు. బ్యాంకు బ్రాంచిల నుండి సామాన్య ఖాతాదారులకు, పెన్షనర్లకు ప్రాధాన్యతా క్రమంలో పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే నిమిత్తం 120 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రైతు బజారుల్లో, చిన్న చిన్న కిరాణా షాపుల వారికి కూడా పీఓఎస్ మిషన్లు అందించుటకు దరఖాస్తులను తీసుకుని బ్యాంకులకు అందించారు.
రిజర్వు బ్యాంకు పంపిణీ చేస్తున్న నగదు కొన్ని బ్యాంకులకు మాత్రమే పరిమితం కాకుండా బ్రాంచీల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. ఈ నెలలో రెండు దఫాలుగా అన్ని బ్యాంకు ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర మంత్రులతో నగదు పంపిణీపై సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలోని ప్రజల అవసరాలకు అనుగుణంగా నగదును అందచేయాలని ఆర్‌బిఐని అభ్యర్థించారు. శుక్రవారం అందుబాటులోకి రూ.2,500 కోట్ల నగదు రాష్ట్రానికి వచ్చింది. బ్యాంకు లావాదేవీలను ఆధారం చేసుకుని ప్రజల అవసరాలకు అనుగుణంగా పెన్షనర్లకు ప్రాధాన్యతనిస్తూ రైతాంగం వ్యవసాయ కార్యకలాపాల నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చేవిధంగా నగదు పంపిణీ చేయాలని ఆదేశించారు.
పింఛనుదార్లకు నగదు చెల్లింపు ఏర్పాట్లు
కృష్ణా జిల్లాలో వున్న మొత్తం పింఛనుదారులు 4,40,724 కాగా నెలకి వారికి చెల్లించాల్సిన పింఛను మొత్తం రూ.35 కోట్లు!. జిల్లాలో ఉన్న 1100 మంది బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా కూడా పింఛనుదారులకు నగదు అందిస్తున్నారు. బిజినెస్ కరస్పాండెంట్లకు తగినంత నగదు చిన్న నోట్ల రూపేణా అందించాలని, సాధ్యమయినంతవరకు వారికి పెద్దనోట్లు ఇవ్వటం, ఇద్దరు, ముగ్గురు పింఛన్‌దార్లకు కలిపి ఒకే పెద్ద నోటు చెల్లించకుండా చూడాలని ప్రతి పింఛనుదారుడికి కనీసం 500 రూపాయలు అందేలా చూడాలని, పెన్షన్ మొత్తం డిసెంబర్ 25 లోపు అందేలా చూడాలని వారు నగదు తీసుకెళ్లడానికి తగిన రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని బ్యాంకర్స్‌ని బాబు ఆదేశించారు. పింఛనుదార్లు బ్యాంకుకు వచ్చినపుడు వారికి ప్రత్యేక కౌంటర్లు, ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయటం వంటి చర్యలు చేపట్టి పింఛనుదారులకు నగదు సజావుగా అందేలా చూడాల్సిందిగా బ్యాంకర్లను అభ్యర్థించడంతో పాటు రాష్ట్ర అధికారులను కూడా వారిని సమన్వయ పరిచే బాధ్యతను అప్పగించారు. అయినా రాష్ట్రంలో చిన్న నోట్ల కష్టం పూర్తిగా తీరడం లేదు.