ఆంధ్రప్రదేశ్‌

పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 16: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్‌సిటీగా ప్రకటించిన ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో తక్షణం పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు దోమల బెడదను నివారింపచేయాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు బహిరంగ లేఖ రాసారు.
ప్రజలకు కనీస పౌర సదుపాయాలు అందక కష్టాలు పడుతున్నారని పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య కార్మికులు లేక దోమలు, డ్రైనేజి సమస్యలతో నగరం దుర్గంధపూరితంగా మారిందని అన్నారు. జిల్లాలోనే అతిపెద్ద ఆసుపత్రి రిమ్స్‌లో 400 పోస్టులు ఖాళీగా వుండటంతో ప్రజలకు వైద్య సదుపాయాలు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. నగరానికి పొంచి వున్న పోతురాజు కాలువ ముంపు వల్ల 12 డివిజన్లలో దుర్గంధం, దోమల బెడద తీవ్రమైందన్నారు. ట్రాఫిక్ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేదన్నారు. ఇక తాగునీటి కొరత తీవ్రంగా వుందంటూ ఇప్పటికైనా స్పందించి నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని కోరారు.