ఆంధ్రప్రదేశ్‌

యువత చేతుల్లోనే రాష్ట్ర భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 16: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, యువతీ యువకులు కష్టపడితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్ట్సు కాలేజి గ్రౌండ్స్‌లో శుక్రవారం వికాస, ఎన్టీఆర్‌ట్రస్టు, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి సంయుక్తంగా ఏర్పాటుచేసిన మహా జాబ్‌మేళాను లోకేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగం చిన్నదా పెద్దదా అని గిరి గీసుకోకుండా ముందు ఏదో ఉద్యోగం సాధించడానికి కష్టపడి, అక్కడ నుంచి మెట్టు మెట్టు పైకెదగాలని లోకేష్ ఉద్బోధించారు. తమ హెరిటేజ్ సంస్థలో చిరుద్యోగం నుంచి ఎంతో మంది డైరెక్టర్ల స్థాయి ఉద్యోగాలకు ఎదిగారని ఉదాహరణగా చెప్పారు. టాప్ 5 కంపెనీల్లో టాప్ 3 కంపెనీలు ఎపిలోనే ఉన్నాయన్నారు. ఎవర్ని ఆదర్శంగా తీసుకోవాలో ఆలోచించుకుని ముందుకెళ్ళాలన్నారు. ముఖ్యమంత్రి నిరంతర కృషివల్ల ఎన్నో సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. ఈ రోజు హైటెక్‌సిటీ వల్ల అంత అభివృద్ధి జరిగిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లేనని అందరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రి కష్టపడే తత్వం అందరికీ ఆదర్శవంతమన్నారు. మైక్రోసాప్ట్ కంపెనీని మన రాష్ట్రం వైపు తిప్పేందుకు ఆయన ఎన్నో కష్టాలు పడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప తదితరులు మాట్లాడారు.
70 సంస్థలు.. 14వేల మంది అభ్యర్థులు
రెండు రోజుల పాటు నిర్వహించనున్న మహా జాబ్ మేళాలో 70 పేరుమోసిన కంపెనీలు పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14వేల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. 70 పేరు మోసిన కంపెనీలు, సంస్థలు రిక్రూట్‌మెంట్ నిమిత్తం వచ్చాయి. ఆర్ట్సు కాలేజి, ఎస్‌కెవిటి డిగ్రీ కాలేజిల ప్రాంగణాల్లోని 100 రూమ్‌లలో ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్ధులను ఎంపిక చేశారు.