ఆంధ్రప్రదేశ్‌

అవినీతి ప్రక్షాళనకే పెద్ద నోట్ల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 17: దేశంలో అవినీతిని కడిగేసే ప్రక్రియ కొనసాగుతోందని, దీనిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) నిర్మించిన చిల్డ్రన్స్ థియేటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని చేస్తున్న యజ్ఞాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు పురాణాల్లో అసురుల మాదిరి అడ్డుపడుతున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో నల్లధనం దాచుకున్న అవినీతిపరులు, తీవ్రవాదాన్ని పెంచి పోషించే ఉగ్రదేశాలు ఖంగుతిన్నాయన్నారు.
నల్లధనం, అవినీతి వంటి రుగ్మతలు దేశాన్ని, వ్యవస్థలను కబళిస్తున్నాయని, వీటి నుంచి దేశాన్ని కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని ప్రధాని మొదటి నుంచి చెపుతున్నారన్నారు. నకిలీ నోట్ల ముఠాలు, డ్రగ్ ముఠాలు, ఉగ్రవాదులు, మహిళలు, బాలల అక్రమ తరలింపునకు పాల్పడే మాఫియాలే నల్లధనంపై ఆధారపడుతున్నాయన్నారు. వీటిని సమూలంగా రూపుమాపేందుకు మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం మంచి ఫలితాలిస్తుందన్నారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కేంద్రం తీసుకుంటున్న సంస్కరణల్లో ఇదొకటన్నారు. సామాన్య ప్రజలు సౌకర్యవంతంగా జీవించేందుకు జన్‌ధన్ యోజన, ఆధార్, మొబైల్ కరెన్సీ వంటి విధానాలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. దీనివల్ల తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీల వల్ల మేలు చేకూరుతుందని అన్నారు. దీర్ఘకాలంగా పాతుకుపోయిన అవినీతిని పారద్రోలేందుకు ప్రధాని మోదీ చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. తద్వారా దేశం, రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తాయని, సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆసరా లభిస్తుందని అన్నారు.