ఆంధ్రప్రదేశ్‌

ఇక దుమ్మురేగేలా ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 17: వివిధ వర్గాల అభివృద్ధి కోసం వేలాదికోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా అవి ఆయా వర్గాలకు ప్రచారరూపంలో చేరడంలేదని భావించిన ప్రభుత్వం ఇక ప్రచారంపై సీరియస్‌గా దృష్టి సారించనుంది. చేసింది చెప్పుకోవడంలో తప్పులేదని, ఆవిధంగా చెప్పకపోతే ప్రతిపక్షాల నిందలు నిజమని నమ్మే ప్రమాదం ఉన్నందున, ఇప్పటివరకూ అనుసరిస్తున్న పాత ధోరణికి తెరదించి, కొత్త తరహా ప్రచారానికి తెరలేపనుంది. అందులో భాగంగా గతంలో వివిధ పత్రికలు, చానెళ్లలో పనిచేసిన అనుభవం ఉన్న మాజీ జర్నలిస్టులతో పరిశోధన విభాగం ఏర్పాటుచేసింది. గతంలో ప్రధానమంత్రి కార్యాలయంలో మీడియా సేవలు అందించిన సమాచార శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఆయా శాఖల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తెలుసుకునేందుకు, ఈ విభాగం జిల్లాలవారీగా స్వయంగా గణాంకాలు తెప్పించుకుని, వాటిని సమాచార, ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు అందిస్తోంది. గతంలో నిధుల కొరతవల్ల ఈ విభాగంలో పనిచేస్తున్న మాజీ జర్నలిస్టులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోయిన ప్రభుత్వం, తాజాగా వారి సేవలు, అవసరాన్ని గుర్తించి 25 మందిని ఎంపిక చేస్తూ వారికి వేతనాలు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ విధానం విజయవంతం కావడంతో, దానికి మరింత పదునుపెట్టి పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. అందులో భాగంగా జనం రద్దీగా ఉండే రైతుబజార్లు, పెట్రోల్‌బంకులు, రహదారుల పక్కన ఉండే దాబాలు, రైల్వే-బస్‌స్టేషన్లు, ప్రభుత్వాసుపత్రులు, సినిమా హాళ్లు, ప్రభుత్వ- ప్రైవేటు కాలేజీ-స్కూళ్ల వద్ద ప్రభుత్వ పథకాలు వివరించే హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఎస్సీ, బీసీ సబ్‌ప్లాన్ నిధులతో అమలుచేస్తున్న పథకాలను ఆయా వర్గాలకు చేరవేసేందుకు కళాబృందాలు ఏర్పాటుచేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న వివిధ రకాల పించనర్లు, 50వేల రూపాయల లోపు రుణమాఫీ పొందిన రైతులు, ఎన్టీఆర్ ఆరోగ్యపథకం, సీఎం రిలీఫ్ ఫండ్ వల్ల లబ్ధి పొందిన వారితో ప్రత్యేక సభలు నిర్వహించాలన్న యోచనలో ఉంది.