ఆంధ్రప్రదేశ్‌

20న ‘తానా’ జానపద కళోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 17: తానా 40వ ఉత్సవాలను పురస్కరించుకుని ఎపి సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్టు రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్ చెప్పారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. డిసెంబర్ 20వ తేదీన రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయిలో తానా చైతన్య స్రవంతి తరపున జానపద కళోత్సవాన్ని స్థానిక ఆనం కళా కేంద్రంలో నిర్వహించనున్నట్టు తెలియజేశారు. అంతరించిపోతోన్న ప్రాచీన జానపద కళలను కాపాడాలని, జానపద కళాకారులను సంరక్షించేందుకు వారికి సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. ఎంతో మంది జానపద కళాకారులకు సాయం అం దిస్తామని, తానా సంస్థ నుంచి ఎన్‌ఆర్‌ఐలు ఎంతో మంది ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని చెప్పారు. జానపద కళోత్సవంలో భాగంగా రాజమహేంద్రవరంలో కళాకారులతో భారీ ఊరేగింపు, అనంతరం ప్రదర్శన, సభ ఏర్పాటు చేశామన్నారు. 1977లో ఆవిర్భవించిన తానా ప్రతీ రెండేళ్ళకొకసారి ఉత్సవాలు నిర్వహిస్తుందని, 2017లో 40వ వార్షిక ఉత్సవాలు జరగనున్నాయని ఎంపి మాగం టి వివరించారు. అదే విధంగా తానా సంస్థ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు విశేషంగా కృషి చేస్తోందన్నారు. తానా సంస్థ అనేక వినూత్న సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఇందులో భాగంగా రైతు కోసం అనే కార్యక్రమం లో అక్కడి టెక్నాలజీ భారతదేశ రైతులకు అనుసంధానం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన జన్మభూమి కార్యక్రమ స్ఫూర్తితో ప్రవాస భారతీయులు మా ఊరికోసం అనే కార్యక్రమాన్ని చేపట్టి వారి వారి గ్రామాల్లో వౌలిక సదుపాయలు, అభివృద్ధి పనుల నిమిత్తం యాభై శాతం నిధులు ఇస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కలుపుకుని పనులు చేయడం జరుగుతోందన్నారు. తానా ఫౌండేషన్ ద్వారా స్కాలర్‌షిప్‌ల పంపిణీ, టీమ్ స్పాట్ అనే కార్యక్రమం ద్వారా విదేశాల్లో ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారి మృత దేశాలను భద్రంగా కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు రాయబార సంస్థలతో కృషిచేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.
తానా సభలకు సుమారు 8 వేల మంది హాజరుకానున్నారని, 17 వేల కుటుంబాలు ఇందులో భాగస్వామ్యమై ఉన్నాయన్నారు. తానా చైతన్య స్రవంతిలో భాగంగా జరిగే కళోత్సవాలు తానా సభలపై అవగాహన కల్పిస్తూ విశాఖ, విజయవాడ, కర్నూలు, కడప, తిరుపతి తదితర చోట్ల నిర్వహించనున్నట్టు తెలిపారు. యుఎస్‌ఐలో ప్రతీ చోటా హిందూ దేవాలయాలు ఉన్నాయని, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటంలో ఎన్‌ఆర్‌ఐలు ఎంతో గౌరవంగా కృషి చేస్తున్నారన్నారు. తానా చైతన్య స్రవంతి జానపద కళోత్సవాలను తమిళనాడు, ఒరిస్సా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ డిసెంబర్ మాసమంతా నిర్వహించనున్నట్టు వాషింగ్టన్ డిసి నుంచి వచ్చిన తానా రీజినల్ కో ఆర్డినేటర్ జనార్ధన్ తెలిపారు. ప్రాచీన జానపద కళలను పునరుద్ధరించమే ఈ సంస్థ లక్ష్యమన్నారు.

జింక మాంసం
విక్రేతల అరెస్ట్
సీతారామపురం, డిసెంబర్ 17: నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్‌లోని చిన్నాగంపల్లి అటవీ ప్రాంతంలో జింక మాంసాన్ని విక్రయిస్తున్న రమేష్, రాపూరు ఏసయ్యలను శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. చిన్నాగంపల్లి ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద గోనె సంచిలను పరిశీలించగా, అందులో దాచి ఉన్న జింక తల, కాళ్లను గుర్తించినట్లు చెప్పారు. జింకను హతమార్చి మాంసాన్ని సైతం విక్రయించినట్లు అనుమానిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని అటవీ అధికార్లకు తెలిజేసి పూర్తి వివరాలను కోర్టుకు నివేదిస్తామని చెప్పారు.

పర్యావరణ పరిరక్షణకు భరోసా ఇస్తారా?
హోప్ ఐలాండ్‌కు రక్షణ ఉందా?
మీ సాంకేతిక పరిజ్ఞానం ఏమిటో చెప్పండి!
కాకినాడ ఎల్‌ఎన్‌జి టెర్మినల్‌పై
ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికుల డిమాండ్

కాకినాడ, డిసెంబరు 17: లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జి) ప్లాంటును నిర్మించిన పక్షంలో పర్యావరణానికి భరోసా ఇస్తారా? సముద్ర తీరంలో సహజసిద్ధంగా ఏర్పడిన హోప్ ఐలాండ్‌కు రక్షణ ఉందా? మత్స్య సంపద కరవైన పక్షంలో మత్స్యకారులకు ఉపాధి కల్పించగలరా? అసలు మీ సాంకేతిక పరిజ్ఞానం ఏపాటిదో చెప్పగలరా? అంటూ పలువురు స్థానికులు ప్రశ్నించారు. ఇక్కడి మత్స్యకారులు సహా ఆయా వర్గాల ప్రజల రక్షణకు ఏ విధమైన రక్షణ చర్యలు తీసుకుంటారో వివరించాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ తీరంలో సుమా రు 900 కోట్ల వ్యయంతో జిఎంఆర్ ఎనర్జీ సెక్టార్ ఆధ్వర్యంలో ఎల్‌ఎన్‌జి టెర్మినల్‌ను నిర్మించనున్న నేపథ్యంలో కాకినాడ పోర్టులో అధికారులు శనివారం పర్యావరణ క్లియరెన్స్‌పై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. సుమారు 350 మంది స్థానికులు పాల్గొనగా వివిధ వర్గాలకు చెందిన 24మంది మాట్లాడారు. వీరిలో కొందరు వివిధ ప్రశ్నాస్త్రాలను అధికారులు, జిఎంఆర్ సంస్థ ప్రతినిధులపై సంధించారు. గ్యాస్ లీక్ అయిన పక్షంలో దానిని అరికట్టేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారు? అని పర్యావరణవేత్త సత్యనారాయణశాస్ర్తీ ప్రశ్నించగా తమ వద్ద అత్యాధునిక రక్షణ పరికరాలున్నాయని సంస్థ ప్రతినిధులు చెప్పారు. అది ఏ విధమైన టెక్నాలజీ అని ఆయన తిరిగి ప్రశ్నించగా వివరణ ఇవ్వకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. హోప్ ఐలాండ్‌కు చెందిన మత్స్యకారులు మాట్లాడుతూ ఎల్‌ఎన్‌జి టెర్మినల్ నిర్మాణం వలన డ్రెడ్జింగ్ నిర్వహించే ప్రమాదం ఉందని, దీని వలన ఐలాండ్‌కు ముప్పు చేకూరే ప్రమాదం ఉంది కదా? అని ఆందోళన వ్యక్తం చేశా రు. ఎల్‌ఎన్‌జి టెర్మినల్ నిర్మాణంతో స్థానిక మత్స్యకారులకు ఉపాధి దూరమయ్యే ప్రమాదం ఉందని, అటువంటి పరిస్థితి వాటిల్లితే తమకు దిక్కెవరంటూ మరో మత్స్యకారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ఊరూరా తగిన ప్రచారం చేయలేదని, ఆయా పంచాయతీల్లో ప్రజలందరికీ తెలియజేసిన తరువాతే ఇటువంటి ప్రక్రియ ప్రారంభించాలని మరో మత్స్యకారుడు కోరాడు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి రవీంద్రబాబు, తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్-2 జె రాధాకృష్ణమూర్తి సమక్షంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ సుమారు 900 కోట్ల వ్యయంతో ఎల్‌ఎన్‌జి టెర్మినల్‌ను నిర్మించాల్సి ఉందన్నారు. నిర్దేశించిన గడువు ప్రకారం ఫిబ్రవరి 2017లో నిర్మాణాన్ని ప్రారంభించి 13 నెలల వ్యవధిలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేయాల్సి ఉందన్నారు. కాకినాడ పోర్టులోని 7వ నంబరు బెర్త్ వద్ద ఎల్‌ఎన్‌జి టెర్మినల్ కోసం ఓ జెట్టీ నిర్మిస్తామని, స్టోరేజ్ ట్యాం క్‌ను నిర్మిస్తామని చెప్పారు. ఇది పూర్తిస్థాయి ఆటోమాటిక్ ప్లాంట్‌గా నిర్మితం కానుందని పేర్కొన్నారు.