ఆంధ్రప్రదేశ్‌

సింహాచలేశుని సన్నిధిలో చీఫ్ జస్టిస్ దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, డిసెంబర్ 17: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్ సతీ సమేతంగా శనివారం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. దేవాలయ ఈవో కె.రామచంద్రమోహన్ అర్చక పరివారంతో ప్రధాన న్యాయమూర్తికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. కప్పస్తంభం అలింగనం చేసుకున్న ప్రధాన న్యాయమూర్తి దంపతులు స్వామివారిని ప్రార్థించుకున్నారు. అంతరాలయంలో ప్రధాన న్యాయమూర్తి పేరున అర్చకులు ప్రత్యేక పూజలు చేసారు. గోదాదేవి సన్నిధిలో హారతులిచ్చారు. ఆస్థాన మండపంలో నాదస్వర వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు ప్రధాన న్యాయమూర్తిని ఆశీర్వదించారు. ఈవో రామచంద్రమోహన్ ప్రధాన న్యాయమూర్తికి ప్రసాదాలను, స్వామివారి చిత్ర పటాన్ని అందజేసారు. దేవాలయంలో కొత్తగా నిర్మించిన పాకశాలను, బేడా మండపంలో ఉన్న స్వామి, అమ్మవార్ల ఆభరణాల చిత్రపటాలను ఈవో ప్రధాన న్యాయమూర్తికి చూపించి వివరించారు. ప్రధాన న్యాయమూర్తి వెంట స్థానిక న్యాయమూర్తులు పివి. జ్యోతిర్మయి, పార్థసారధి, గాయిత్రి ఉన్నారు. చినగదిలి ఎమ్యార్వో శంకరరావు, గోపాలపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వైకుంఠరావు భధ్రత పర్యవేక్షించారు.

చిత్రం..కప్పస్తంభం వద్ద నమస్కరిస్తున్న జస్టిస్ ఠాకూర్ దంపతులు