ఆంధ్రప్రదేశ్‌

జస్టిస్ సిటీగా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 17: జస్టిస్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో భాగంగా శనివారం విశాఖ పోర్టు కళావాణిలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపట్ల తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. నాణ్యమైన, మెరుగైన న్యాయ సేవలు అందే విధంగా న్యాయ వ్యవస్థకు సంబంధించిన అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురాలనేది తన అభిప్రాయమన్నారు. ఉత్తమ న్యాయ విశ్వవిద్యాలయాలుగా ఎదగడానికి నాణ్యమైన న్యాయ విద్యను అందించాల్సి ఉందన్నారు. అమరావతిలో జస్టిస్ సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధిచేసేందుకు తాను కృషి చేస్తానన్నారు. దీనికి న్యాయ వ్యవస్థ తరపున తగిన సహాయ, సహకారాలు అందించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్‌ను ఆయన కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ న్యాయ వృత్తిలో ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారన్నారు. సబ్బవరంలో నిర్మించే న్యాయ విశ్వవిద్యాలయానికి తాను రూ.25 కోట్ల మేర నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. న్యాయ వృత్తిలో ఎగదడంతోపాటు దేశానికి న్యాయ నిపుణులుగా సేవలందించాల్సి ఉందన్నారు. శక్తివంతమైన న్యాయ వ్యవస్థ కోసం న్యాయ విశ్వవిద్యాలయాలు పెరగాలని, వీటిలో వౌలిక వసతులు పెంచాల్సి ఉంద్నారు. భారతదేశం ఇపుడు ఎనిమిది శాతం వృద్ధిరేటును సాధించిందన్నారు. భారత్, అమెరికా, చైనాలు ప్రపంచ దేశాల్లోనే ఆర్ధిక వనరులు కలిగిన దేశాలుగా 1,2,3 మూడు స్థానాల్లో నిలుస్తున్నాయన్నారు. వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) త్వరలో అమల్లోకి వస్తుందన్నారు. దీనివల్ల నోట్ల రద్దు, నల్లధనం బయటపడటం వంటివి జరుగుతాయన్నారు. ప్రపంచీకరణ తరువాత పరిస్థితుల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, వీటిని ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా మార్చుకోవాల్సి ఉందన్నారు. గోల్డ్, సిల్వర్ మెడల్స్ పొందిన న్యాయవాదులు, మహిళా న్యాయవాదులను ఆయన అభినందించారు. దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం వైస్-్ఛన్సలర్ ప్రొఫెసర్ వి.కేశవరావు విశ్వవిద్యాలయం నుంచి తయారైన న్యాయ నిపుణుల గురించి వివరించారు. ప్రోఫెసర్లు, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.

చిత్రం..విశాఖ లా వర్శిటీ స్నాతకోత్సవంలో విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేస్తున్న చీఫ్ జస్టిస్ టిఎస్.్ఠకూర్