ఆంధ్రప్రదేశ్‌

నెలాఖరుకు పోలవరం కాంక్రీటు పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 18: పోలవరం కాంక్రీటు పనులు ఈ నెలాఖరుకు ప్రారంభమవుతాయని రాష్ట్ర జలనవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు, సుజనాచౌదరి హాజరుకానున్నారు. వీరితోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు ఈకార్యక్రమంలో పాల్గొంటారన్నారు. పదమూడు జిల్లాల రైతులను ఆహ్వానిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చొరవతో పోలవరం పనులు మరింత వేగవంతమయ్యాయని చెప్పారు. డయాఫ్రమ్ వాల్ పనులు జనవరిలో జరగనున్నాయన్నారు. 48 గేట్ల నిర్మాణ పనులు ప్రాజెక్టు ప్రాంతంలోనే మొదలుకానున్నాయని, వీటి నిర్మాణానికి భిలాయ్, విశాఖ స్టీలు ప్లాంట్లకు చెందిన 18 వేల టన్నుల స్టీలు వినియోగిస్తున్నామన్నారు. 530 రోజుల్లో 5 కోట్ల 62 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపనులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ముంపు మండలాల ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని, నిర్వాసితులకు పునరావాసం అందిస్తామన్నారు. విదేశీ యంత్రాలను వినియోగించి పనులను మరింత వేగవంతం చేసి 2018 నాటకి పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. పగలూ, రాత్రీ తేడా లేకుండా పోలవరం పనులు జరుగుతున్నాయని మంత్రి దేవినేని వివరించారు. మంత్రి వెంట ఇఎన్‌సి ఎం వెంకటేశ్వరరావు, సిఇఎన్ హరిబాబు తదితరులున్నారు.
నేటి సిఎం పర్యటన వాయిదా
నెలలో ప్రతి మూడో సోమవారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన వాయిదాపడిందని మంత్రి దేవినేని పోలవరంలో తెలిపారు. ఆదివారం ప్రాజెక్టు ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈసందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ సోమవారం విజయవాడ నుండి ముఖ్యమంత్రి పనులపై వర్చువల్ తనిఖీ జరుపుతారన్నారు.