రాష్ట్రీయం

తుపాన్లలో ఆశా‘దీపం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబర్ 18: తుపాన్లు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు విద్యుత్ సరఫరా నిలిచిపోయి, రోజుల తరబడి అంధకారంలో గడిపే బాధితులను దృష్టిలో ఉంచుకుని ఓ సాంకేతిక నిపుణుడు ఎల్‌ఇడి క్యాండిల్ రూపొందించాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరానికి చెందిన సూక్ష్మకళాకారుడు ఆరిపాక రమేష్‌బాబు తనకున్న సాంకేతిక అనుభవంతో ఈ పరికరాన్ని సృష్టించారు. ఆపద సమయాలలో బాధిత ప్రజలకు చేదోడుగా ఉండే ఈ ఎల్‌ఇడి క్యాండిల్స్ అందుబాటులోకి తెస్తే ఎంతో ఉపయోగపడతాయని, తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు ఈ లైటు సహాయాన్ని పొందవచ్చని ఆయన తెలిపారు. ఇటీవల వార్దా తుపాను చెన్నై మహానగరాన్ని కుదిపేసిందని, అలాగే ఏటా సంభవిస్తున్న తుపాన్ల బారిన పడి చీకటిలో మగ్గుతున్న బాధితులకు ఎల్‌ఇడి క్యాండిల్స్ ఎంతో చేయూతనిస్తాయని పేర్కొన్నారు. ఎల్‌ఇడి క్యాండిల్ రెండు సెల్స్‌తో పనిచేస్తుందన్నారు. రెండు సెల్స్‌తో 8 రాత్రులు క్యాండిల్ పనిచేస్తుందని చెప్పారు. దీనిని ఎవరికి వారుగా తయారుచేసుకుని వినియోగించుకునే వీలుందన్నారు. ఇందుకు 3 వోల్ట్స్ ఎల్‌ఇడి బల్బు, 2సెల్ కంపార్ట్‌మెంట్, 2 పెన్‌సెల్స్ ఉంటే సరిపోతుందని చెప్పారు. అలాగే సోలార్ పేనల్స్ ఉపయోగించి 100 ఎహెచ్, 150 ఎహెచ్ బ్యాటరీలకు అనుసంధానించడం ద్వారా మినీ ఎల్‌ఇడి ప్లాంట్స్‌ను కూడా రూపొందించుకోవచ్చని ఆయన తెలియజేశారు. సోలార్ ప్యానెల్స్ ఉపయోగించి 100 ఎహెచ్, 150 ఎహెచ్ బ్యాటరీలను ఛార్జింగ్‌చేసి, ప్రతి కుటుంబానికి వైరు ద్వారా ఎల్‌ఇడి బల్బులను కనెక్ట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

చిత్రం..రమేష్‌బాబు రూపొందించిన ఎల్‌ఇడి క్యాండిల్స్. ఇన్‌సెట్‌లో రూపకర్త