రాష్ట్రీయం

మావటిపై గజరాజు దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 18: తిరుమలలో శ్రీవారికి తమ వంతు సేవలందిస్తు గజరాజులను కంటికి రెప్పలా సంరక్షిస్తున్న గంగయ్య అనే మావటిపై ఆదివారం సాయంత్రం అవనిజ అనే గజరాజు దాడి చేసింది. ఈసంఘటనలో తీవ్రంగా గాయపడ్డ గంగయ్యను వెంటనే చికిత్స కోసం అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి అత్యవసర వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్‌కు తరలించారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రతిరోజు శ్రీవారి ఊరేగింపు సందర్భంగా మావటిలు గోశాలలోని గజరాజులను ఆలయం ముందుకు తీసుకొస్తారు. అందులో భాగంగానే లక్ష్మి, అవనిజ అనే గజరాజులను ఆలయం ముందుకు తీసుకొస్తున్నారు. ఏమైందో తెలియదు కాని తూర్పు మాడవీధిలోని వరాహస్వామి ఆలయం వద్దకు రాగానే ఊహించని రీతిలో అవనిజ తన తొండంతో మాటిని కొట్టి పాదంతో కాళ్లపై తొక్కింది. దీంతో అతడి కాలు విరిగింది. ఊహించని ఈ పరిణామానికి గంగయ్య భీతిల్లాడు. తక్షణం తేరుకున్న మరో మావటి అవనిజను అదుపుచేసి కాళ్లకు సంకెళ్లు వేసి నెమ్మదిగా గోశాలకు తీసుకెళ్లాడు. గాయపడ్డ గంగయ్యను స్థానిక అశ్విని ఆసుపత్రికి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం స్విమ్స్‌కు తరలించారు.

చిత్రం..దాడిలో గాయపడ్డ మావటి గంగయ్య