ఆంధ్రప్రదేశ్‌

టిటిడి తరహాలో ఆలయాల్లో పారిశుద్ధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 18: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఆర్థిక లావాదేవీలు, పారిశుద్ధ్య నిర్వహణను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న విధానాన్ని అమలు చేసే అంశంపై రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ యోచిస్తున్నది. ఈ విధానం అమలు చేయడం వల్ల భక్తులకు మరింత మేలైన సేవలు అందించే వీలు ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో సంవత్సరానికి 25 లక్షల రూపాయల పైబడి ఆదాయం వచ్చే దేవాలయాలు 115 ఉండగా, రెండు నుంచి 25 లక్షల రూపాయలు వచ్చే ఆలయాల సంఖ్య 794 ఆలయాలు ఉన్నాయి. రెండు లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలు 22,788 ఉన్నాయి. తిరుపతిలో అన్ని రకాల ఆర్థిక లావాదేవీలను కంప్యూటరీకరించారు. టిక్కెట్లు, ప్రసాదాల విక్రయం, రూమ్‌ల కేటాయింపు వంటివి అన్ని ఒక నెట్‌వర్క్‌కు అనుసంధానించారు. దీంతో ఎక్కడా అక్రమాలు జరుగకుండా నిరోధించే వీలు కలుగుతోంది. రోజూ లక్షకు పైగా భక్తులు వస్తున్నప్పటికీ, పారిశుద్ధ్యం సమస్య తలెత్తకుండా నిర్వహించడం గమనార్హం. దీనిని దృష్టిలో ఉంచుకుని టిటిడిలో అమలు చేస్తున్న విధానాలను ఇతర ఆలయాల్లో కూడా ప్రవేశపెట్టాల్సిన దేవాదాయశాఖ దృష్టి సారించింది. కొన్ని ఆలయాల్లో ఆఫీస్ కార్యకలాపాలు, కొన్ని నగదు లావాదేవీలను కంప్యూటరీకరించినప్పటికీ, పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని టిటిడి తరహాలో అన్ని ఆలయాల్లో వివిధ సేవల టిక్కెట్ల విక్రయాలు, గదుల కేటాయింపు, విరాళాల స్వీకరణ తదితర అంశాలను కంప్యూటరీకరించి ఆన్‌లైన్‌లోకి తీసుకు వచ్చేందుకు ప్రతిపాదిస్తున్నారు. దీని వల్ల సిబ్బంది జోక్యం వీలైనంత తక్కువ చేసే వీలు ఉంటుందని భావిస్తున్నారు. భక్తులకు మరింతగా సౌకర్యంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు చాలా ఆలయాల్లో పారిశుద్ధ్యం సక్రమంగా నిర్వహించని పరిస్థితి నెలకొంది. సిబ్బంది కొరతకు అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో చాలా ఆలయాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ అంతంత మాత్రంగా ఉంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో అమలు చేస్తున్న విధానంలో ఇతర ఆలయాల్లో అమలు చేసే అంశం పరిశీలనలో ఉంది. టిటిడిలో 2003 నుంచి ఆర్థిక లావాదేవీలను కంప్యూటరీకరించారు. 13 సంవత్సరాల నుంచి అనేక మార్పులు చేస్తూ, వ్యవస్థను పక్కాగా రూపొందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అమలు చేస్తున్న అక్కౌటింగ్ వ్యవస్థను ఇప్పటికే అనంత పద్మనాభ స్వామి ఆలయ అధికారులు అధ్యయనం చేసి, అక్కడ అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మిగిలిన ఆలయాల్లో కూడా ఆ విధానాలను అమలు చేసేందుకు ప్రతిపాదిస్తున్నారు. ఆలయాలకు సంబంధించిన అన్ని అంశాలను కంప్యూటరీకరించి, సిఎం డాష్ బోర్డుకు అనుసంధానం చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అవసరమైతే కొంతమంది అధికారులకు, సిబ్బందికి తిరుమలలో శిక్షణ ఇచ్చే అంశంపై కూడా దృష్టి సారించారు. ఈ విషయమై దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిసింది.