రాష్ట్రీయం

ఉత్తమ రచనలు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), డిసెంబర్ 18: ప్రజలందరిలో మంచి ఆలోచనలను రేకెత్తించి, సమాజానికి ఎల్లప్పుడూ మంచిచేసే ఉత్తమ రచనలను మరింతగా అందించాల్సిందిగా సాహితీవేత్తలను వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఆదివారం రాత్రి నగరంలోని ఓ హోటల్‌లో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యాన డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు రచించిన భూమిక గ్రంథావిష్కరణ సభ నిర్వహించారు. సభకు అజోవిభొ కందాళం ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా ప్రత్తిపాటి పుల్లారావు తొలుత గ్రంథాన్ని ఆవిష్కరించి అనంతరం ప్రసంగించారు. తాను రచించిన పుస్తక విజ్ఞానం ద్వారా సంఘానికి ఎంతోమేలు చేస్తున్న సాంబశివరావు భూమిక గ్రంథాన్ని సమాజ హితైభిలాషి, అనేక జనశ్రేయోదాయకమైన కార్యక్రమాలకు చేయూతనిస్తున్న బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తికి అంకితమివ్వడం ముదావహమన్నారు. ఆయన రచించిన సారా సంహారం ఎన్టీఆర్‌ను అమితంగా ఆకర్షించిందన్నారు. సభకు అధ్యక్షత వహించిన అప్పాజోస్యుల సత్యనారాయణ ప్రసంగిస్తూ కందిమళ్లతో తనకు రెండు దశాబ్దాలకు పైబడి ఆత్మీయతానుబంధం కొనసాగుతూనే ఉందన్నారు. తామిద్దరికీ కళలు, నాటకాలే ఈ అనుబంధాన్ని కలిగించాయన్నారు. పరిషత్‌లకు సలహాదారుగా, ప్రయోక్తగా బహుముఖీన సేవలను ఆయన అందిస్తున్నారన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ జి విజయభాస్కర్, పుస్తకాన్ని సమీక్షించిన వివేకానంద సర్వీసింగ్ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ, అంతర్జాతీయ పద్య కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ, సాహితీవేత్తలు డాక్టర్ వెన్నిసెట్టి సింగారావు, డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ మాట్లాడుతూ కందిమళ్ల సాహిత్య సేవలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు. గ్రంథస్వీకర్త కృష్ణమూర్తి కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడుతూ సాహిత్య, సారస్వత రంగాలకు తనవంతు సహకారాన్ని కొనసాగిస్తూనే ఉంటానని వివరించారు.

చిత్రం..‘్భమిక’ ను ఆవిష్కరిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ