ఆంధ్రప్రదేశ్‌

నోట్ల మార్పిడి పేరుతో ఘరానా మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోటపల్లిగూడూరు, డిసెంబర్ 18: రద్దయిన పాత నోట్లను మార్చుకొని కొత్త నోట్లు ఇస్తామంటూ మోసం చేయడమే కాక, బాధితులు తీసుకొచ్చిన నగదును దోపిడీ చేసే ముఠాల ఆగడాలు నెల్లూరు జిల్లాలో మితిమీరుతున్నాయి. తాజాగా తోటపల్లిగూడూరు మండలంలోనూ ఇదే తరహా ఘటనలో బాధితులు 24 లక్షల 25 వేల రూపాయలు పోగొట్టుకొని లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్ గడప ఎక్కారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు, ఈదూరు గ్రామాలకు చెందిన కొందరు ముఠాగా ఏర్పడి పాత నోట్లకు కొత్తనోట్లను మార్పిడి చేసుకుంటామంటూ ప్రచారం చేసుకున్నారు. ఈక్రమంలో తన సన్నిహితుల ద్వారా విషయం తెలుసుకున్న నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన వావిలాల పార్ధసారథి మరో నలుగురితో కలిసి ముఠా సభ్యులు సూచించిన మేరకు ఆదివారం ఉదయం కోడూరు గ్రామ సమీపానికి వెళ్లారు. ముందుగానే వ్యూహంతో ఉన్న ముఠా సభ్యులు పార్ధసారథి అక్కడకు రాగానే నగదు మార్చుకుంటున్నట్లు నటించి పార్ధసారథి, అతని వెంట వచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడి చేసి వారి వద్ద నుంచి రూ.24 లక్షల 25 వేల నగదును దోచుకెళ్లారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నిందితులు కూడా పోలీసుల అదుపులో తీసుకొని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం తమ అదుపులో ఎవరూ లేరని దర్యాప్తు కొనసాగుతోందనే కోణంలో తెలియచేశారు.
భాషాభివృద్ధికి సర్వ సమగ్ర సంస్థ
బోధనాంశంగా కూచిపూడి నృత్యం : బుద్ధప్రసాద్

నెల్లూరు, డిసెంబర్ 18: త్వరలో రాష్ట్రంలో సర్వ సమగ్ర భాషాభివృద్ధి సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు శాసనసభ డిప్యూటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ వెల్లడించారు. ఆదివారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రస్థాయిలో ఉన్న కేంద్ర సాహిత్య, నృత్య, లలిత అకాడమీలను రాష్ట్రంలో పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారని అన్నారు. రాష్ట్రంలో తెలుగు భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన కమిటీలో తాను ఒక సభ్యుడినని, చుట్టుపక్కల రాష్ట్రాల్లో పర్యటించి అక్కడ తమ భాష అభివృద్ధికి వారు తీసుకుంటున్న చర్యలను పరిశీలించడం పూర్తయిందన్నారు. రాష్ట్రంలోనూ విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి నగరాల్లో తెలుగు భాషా కోవిదులు, ప్రముఖులతో సమావేశాలను తమ కమిటీ నిర్వహించిందని, అక్కడ హాజరైన వారి సూచనలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రికి తమ సంఘం నివేదిక ఇవ్వనుందని, అందులో భాగంగా కూచిపూడి నృత్యాన్ని విద్యార్థినులకు బోధనాంశంగా తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వానికి నివేదించనున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో శిథిలావస్థకు చేరుకున్న గ్రంథాలయాలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని బుద్ధప్రసాద్ చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామినాయుడు పాల్గొన్నారు.
వృద్ధుడి సజీవ దహనం

శ్రీకాకుళం, డిసెంబర్ 18: శ్రీకాకుళం జిల్లా, గార మండలం శ్రీకూర్మం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. ప్రమాదం ఎలా సంభవించిందో తెలియరాలేదు. అయితే, దారపు ఎర్రయ్య అలియాస్ బంగారి (68) ఈయన కుమారుడు దుర్గారావులు ఉంటున్న ఇల్లు నుంచి అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. గ్యాస్ సిలిండర్ పేలి, మంటలు మరింతగా రాజుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ఎవ్వరూ సాహసించలేదు. దీంతో కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన ఎర్రయ్య సజీవ దహనమయ్యాడు. నిరుపేద కుటుంబం కావడం వలన ఎర్రయ్య భార్య మధ్యాహ్నం భోజనం పెట్టి తిరిగి కూలిపనికి వెళ్లిపోవడం ఇంతలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శ్రీకాకుళం అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి హుటాహుటిన గ్రామానికి చేరుకొని అగ్ని బాధిత కుటుంబాలను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకొని తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈమెతోపాటు మాజీ ఎఎంసి చైర్మన్ బరాటం నాగేశ్వరరావు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. అగ్ని బాధిత కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్థానిక ఎస్‌ఐ బి.గణేష్ ఎర్రయ్య మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.