ఆంధ్రప్రదేశ్‌

అంతర్రాష్ట్ర దొంగల ముఠాల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, డిసెంబర్ 18 : రాష్ట్రంతో పాటు కర్నాటకలోని వివిధ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర ఘరానా దొంగల ముఠాలను అనంతపురం జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. వేర్వేరుగా పట్టుబడిన ఈ రెండు ముఠాల వివరాలను ఆదివారం అనంతపురం నగరంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ ఎస్‌వి.రాజశేఖరబాబు విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. మర్డర్ ఫర్ గెయిన్(డబ్బు కోసం హత్య), 3 చైన్ స్నాచింగ్‌లు, 10 హౌస్ బ్రేకింగ్‌లకు పాల్పడిన ఐదుగురు సభ్యులున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఇ.నాగరాజు అలియాస్ ముత్యాలు(50), గుజ్జల ముత్యాలప్ప అలియాస్ మూగోడు(60), ఇ.మల్లికార్జున (40), ఇ.రాజప్ప అలియాస్ రాజు(42), గుజ్జల రమేష్ (28) ఉన్నారు. అదనపు ఎస్పీ కె.మాల్యాద్రి పర్యవేక్షణలో పెనుకొండ డీఎస్పీ ఎన్.సుబ్బారావు నేతృత్వంలో మడకశిర సిఐ, పెనుకొండ సబ్ డివిజన్ టాస్క్ఫోర్స్ ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో ఏర్పడిన ప్రత్యేక బృందం మడకశిర-పెనుకొండ రహదారిలోని చౌటిపల్లి క్రాస్ వద్ద ఆదివారం ఆ ముఠాను అరెస్టు చేశారు. ఈ కేసులోని మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇక వారి నుంచి రూ. 30 లక్షల విలువ చేసే కిలో బంగారు ఆభరణాలు, 2 బైక్‌లు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
దేవాలయాల్లో వంశపారంపర్య చోరీలు
దేవాలయాల్లో వంశపారంపర్యంగా చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను సిసిఎస్ డీఎస్పీ నాగసుబ్బన్న ఆధ్వర్యంలో బుక్కరాయసముద్రం ఎస్‌ఐ ఎ.విశ్వనాథచౌదరి, ఏఎస్‌ఐలుతో కూడిన ప్రత్యేక బృందం అరెస్టు చేసింది. వారిలో కావడి వీరేష్(29), కావడి రామన్న(62), జి.సుధప్ప(35) ఉన్నారు. వీరి నుంచి రూ. 6.2 లక్షల విలువ చేసే 12.6 కిలోల వెండి, 36 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 9 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కావడి రామన్న, కావడి వీరేష్ తండ్రీ కొడుకులు కావడం విశేషం. వీరు రాష్ట్రంలోని ఏడు దేవాలయాల్లో జరిగిన 10 చోరీ కేసుల్లో నిందితులు.

చిత్రాలు..విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాజశేఖరబాబు, ముఠా సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి ఆభరణాలు