ఆంధ్రప్రదేశ్‌

తొలి డిజిటల్ గ్రామంగా ద్వారపూడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 19: దేశంలోనే తొలి డిజిటల్ ఆదర్శ గ్రామంగా విజయనగరం మండలం ద్వారపూడి గ్రామం వినుతికెక్కిందని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కితాబిచ్చారు. తాను దత్తత తీసుకున్న గ్రామం ఆదర్శ గ్రామంగా రూపుదిద్దడంలో గ్రామస్థులు ఎంతగానో సహకరించారన్నారు. సోమవారం రాత్రి ఆయన ద్వారపూడి గ్రామంలో సమావేశమయ్యారు. ఒకప్పుడు సాధారణ గ్రామంగా ఉన్న ద్వారపూడి నేడు పర్యాటక కేంద్రంగా తయారైందన్నారు. ఈ గ్రామాన్ని సందర్శించేందుకు నీతి ఆయోగ్ ఉన్నతాధికారుల బృందం రావడం ఆనందంగా ఉందన్నారు. అతి తక్కువ కాలంలోనే నగదు రహిత లావాదేవీలను నేర్చుకొని గ్రామస్థులు ప్రగతిపథంలో దూసుకుపోతున్నారని ఆయన కొనియాడారు. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కిమిడి మృణాళిని మాట్లాడుతూ రానున్న కాలంలో గ్రామ పంచాయతీలకు మంచి ఫలాలు అందనున్నాయన్నారు.