ఆంధ్రప్రదేశ్‌

చిల్లర నోట్ల కమీషన్ వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 19: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం కొందరు వ్యాపారులకు కనక వర్షం కురిపిస్తోంది. ప్రజల నుంచి వచ్చిన చిల్లర నోట్లను ధనంతులకు ముట్టజెప్పి పెద్దమొత్తంలో కమీషన్లు తీసుకోవడం ద్వారా కొత్త తరహా నల్లవ్యాపారం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యాపారులకు కమీషన్ల రూపంలో భారీ ఎత్తున లబ్ది చేకూరినట్లు సమాచారం. నోట్లు రద్దయినప్పటి నుంచి నిబంధనలకు అనుగుణంగా ప్రజల నుంచి పెద్ద నోట్లు తీసుకోవాల్సి ఉన్నా వారిని ఇబ్బందులకు గురి చేసి చిన్న నోట్ల తీసుకున్న వ్యాపారులు వాటిని కమీషన్ కోసం ఇతరులకు ఇచ్చి వారి వద్ద తీసుకున్న పెద్ద నోట్లను తమ ఖాతాల్లో జమచేసినట్లు సమాచారం. తద్వారా వ్యాపారులకు కమీషన్ రూపంలో లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. రాష్టవ్య్రాప్తంగా ఇదే తరహాలో ఈనెల 15వ తేదీ వరకు జరిగిందని వెల్లడవుతోంది. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8వ తేదీ అర్ధరాత్రి పెద్దనోట్లను రద్దు చేసింది. ప్రజలు తమ వద్ద ఉన్న పెద్ద నోట్ల మార్పిడికి బ్యాంకుల్లో ఏర్పాటు చేయగా వ్యాపారులు తమ కరెంటు ఖాతాల్లో జమ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇక వ్యాపారులు తొలుత ఈనెల 1వ తేదీ వరకు ప్రజల నుంచి పెద్ద నోట్లను స్వీకరించాలని ఆ తరువాత 15వ తేదీ వరకు పెట్రోలు బంకులతో పాటు ఇతర ప్రాంతాల్లో రూ.500 నోట్లను తీసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇలా వచ్చిన పెద్ద నోట్లను వారు తమ ఖాతాలో జమ చేసుకోవాలని సూచించింది. ఈ అవకాశమే అనేక మంది వ్యాపారులకు వరంగా మారింది. ఎరువులు, మద్యం దుకాణాలు, పెట్రోలు బంకులు, భారీ ఎత్తున వ్యాపారం జరిగే మెడికల్ దుకాణాలు, అనేక ఆసుపత్రులు ప్రజల నుంచి పెద్ద నోట్లను స్వీకరించాల్సి ఉండగా చిల్లర లేదన్న కారణం చూపి ప్రజల నుంచి రూ.100 అంతకన్నా తక్కువ విలువ గలిగిన నోట్లను తీసుకున్నాయి. ఇలా వచ్చిన చిల్లరను తిరిగి పెద్ద నోట్లు ఇచ్చిన ప్రజలకు ఇవ్వాల్సి ఉండగా అలా చేయకుండా వచ్చిన చిల్లర నోట్లను 20 నుంచి 25 శాతం కమీషన్‌కు బడాబాబులకు అందించి వారి నుంచి రద్దయిన పెద్ద నోట్లను స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇలా వచ్చిన పెద్ద నోట్లను తమ ఖాతాల్లో జమ చేసి కొనుగోళ్లకు ఆయా బ్యాంకుల నుంచి డిడిలు తీసుకుని వ్యాపారం నిర్వహించినట్లు వెల్లడవుతోంది. జనాన్ని పీడించి తీసుకున్న చిల్లర నోట్లు నల్ల ధనవంతుల చేతికి చేరినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో బ్యాంకులు ఏమీ చేయలేని పరిస్థితి ఉందని ఓ బ్యాంకు ఉన్నతాధికారి పేర్కొన్నారు. వ్యాపారులకు ప్రజల నుంచి వచ్చిన చిల్లర నోట్లను ఇటు బ్యాంకుల్లో జమచేయకుండా, అటు ప్రజలకు ఇవ్వకుండా నల్ల ధనవంతుల రహస్య ప్రదేశాలకు తరలించారని స్పష్టం చేశారు. కొత్త రూ.2వేలు, రూ.500 నోట్లపై మాత్రమే ఐటి అధికారులు దృష్టి పెట్టారే తప్ప వ్యాపారుల నుంచి నల్ల ధనవంతుల ఇళ్లకు చేరిన రూ.100 నోట్లపై విచారణ ప్రారంభించి కఠిన చర్యలు తీసుకుంటే రాష్ట్రంలో చిల్లర సమస్య తలెత్తేది కాదని ఆయన పేర్కొనడం గమనార్హం.