ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాకుళం ఎంపీతో పెందుర్తి ఎమ్మెల్యే కూతురి పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక, డిసెంబర్ 20: టిడిపి సీనియర్ నేత, దివంగత ఎంపి కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు, ప్రస్తుత శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్‌నాయుడు పెళ్లి కొడుకు కాబోతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి రెండో కూతురు శ్రావ్యతో ఎంపీకి పెళ్లి సంబంధం కుదిరింది. శ్రావ్య ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతోంది.
ఎమ్మెల్యే పెద్ద కూతురు, ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్న పెద్ద కూతురికి ఇటీవలే అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో పెళ్లి ఫిక్సయింది. మిర కొద్ది రోజుల్లో వీరి వివాహం జరగనుంది. ఆ నిశ్చితార్థం జరిగిన కొద్దిరోజులకే ఎంపి రామ్మోహన్‌నాయుడు కుటుంబం బండారు రెండో కుమార్తెతో సంబంధం కుదుర్చుకున్నారు.
నెల రోజుల్లో రెండు వివాహాలు చేయడానికి ఎమ్మెల్యే బండారు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ రెండు కుటుంబాలు వివాహ బంధంతో ఒకటి కావడంతో ఉత్తరాంధ్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగాను, పార్టీపరంగా టిడిపి మరింత బలపడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.