ఆంధ్రప్రదేశ్‌

ముళ్లపొదల్లో కరెన్సీ కట్టలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, డిసెంబర్ 20: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పట్టణాని సమీపంలోని లక్ష్ముడిపేట గ్రామ శివారు ముళ్లపొదల్లో సుమారు రూ.40 లక్షల రూ.2వేల కొత్తనోట్ల కరెన్సీ కట్టలు మంగళవారం బయట పడినట్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల సమాచారం మేరకు గ్రామానికి చెందిన మొదలవలస దివాకరు, సత్తారు రామ్మోహన్, కనుకల పవన్ అనే ముగ్గురు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ముళ్లపొదల వద్ద బహిర్భూమికి వెళ్లి వస్తుండగా ఈ కరెన్సీ కట్టలు కంట పడినట్లు పోలీసులు తెలిపారు. వీరికి దొరికిన ఈ కరెన్సీ కట్టలను సమీపంలో ఉన్న వెంకయ్యపేట రహదారి కానా కింద ఉన్న పొదల్లో ఉంచి ఇంటికి వెళ్లి వీరి బంధువులకు ఈవిషయం చెప్పగా వారు వచ్చి ఈ కట్టలను చూసేలోగా మరో ఇద్దరు వ్యక్తులు వీటితో పారిపోతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. పరిసర గ్రామాల్లో కలకలం రేగడంతో స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ఈ ముగ్గురు బాలురును అదుపులోకి తీసుకొని ప్రాథమిక విచారణ చేపట్టారు.