ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ సమయాన్ని రోజా వృథా చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: వైకాపా ఎమ్మెల్యే రోజా మభ్యపెట్టాలనుకుంటే మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. శనివారం నాడు ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డి ప్రజాసమస్యలను గాలికొదిలేసి అసెంబ్లీ ముందు రోజా జబర్దస్తీ స్కిట్లు ప్రదర్శిస్తూ అసెంబ్లీ సమయాన్ని వృథా చేశారని విమర్శించారు. జ్యోతుల నెహ్రూ, కొడాలి నాని లాంటి వాళ్లు క్షమాపణలు చెప్పారని, దళిత మంత్రిని దూషించడం, కాళ్లు నడుము చూపించి నాలుకను ప్రదర్శించి రోజా పిల్ల చేష్టలు చేయడం సభా హుందాతనానే్న అవమానించే విధంగా ఉందని ఆరోపించారు. ఉద్యోగాల సృష్టికి చంద్రబాబునాయుడు నిరంతరం శ్రమిస్తూంటే జగన్ అడ్డుపడాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి విషయానికి సిబిఐ విచారణ కోరడం విడ్డూరమన్నారు. వైకాపా నేతలు ప్రజాస్వామిక విధానాలను కాలరాయవద్దని, ఇకనైనా ప్రజాస్వామికంగా ప్రవర్తించాలని ఆయన హితవుపలికారు.