ఆంధ్రప్రదేశ్‌

మనమే ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 21: ‘రాష్ట్రంలో నగదు కొరతను నివారించటానికి, నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను అధిగమించటానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకుంది. అందులో భాగంగా ఈ పోస్, రూపే కార్డులు, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు పెద్ద ఎత్తున జరగడానికి చర్యలు తీసుకున్నాం. ఇంకా మొబైల్ ద్వారా ఆన్‌లైన్ లావాదేవీలు జరపటానికి ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కాలేజీల్లోని ఇంజనీరింగ్ విద్యార్థులను ఉపయోగించుకొని గ్రామాల్లో నగదు రహిత లావాదేవీలు పెరగడానికి దృష్టి కేంద్రీకరించాలి. నగదురహిత లావాదేవీలు అమలు జరుపుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుంద’ని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
డిజిటలైజేన్‌లో భాగంగా ఆన్‌లైన్ లావాదేవీలు రాష్ట్రంలో అత్యధికంగా నిర్వహిస్తున్న ఐటి అధికారులు ప్రద్యుమ్న, విజయానంద్‌లను, ఐటి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాధ రెడ్డిలను ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల మొదటి రోజు సమావేశంలో బుధవారం సత్కరించారు.
అనంతరం బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ డెబిట్, క్రెడిట్, రూపే కార్డులు, బయోమెట్రిక్ విధానాలు ఉపయోగించి ప్రజలకు పెద్దనోట్ల రద్దు వల్ల ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. బయోమెట్రిక్ విధానాలతో పెన్షన్లు, రేషన్ షాపులలో ఈ-పాస్ విధానాలలో రాష్ట్రం డిజిటలైజేషన్ చేసిందని, దేశంలో నోట్లరద్దు తర్వాత ఈ కొత్త సాంకేతిక విధానాలు ద్వారా సమస్యలను అధిగమించటానికి కృషి చేశామన్నారు.
రైతుబజార్లలో, వివిధ షాపులలో స్వైపింగ్ యంత్రాలు ఉపయోగించి నగదు రహిత విధానాలు ప్రోత్సహించిన ఘనత దేశంలో ఆంధ్రప్రదేశ్‌కే దక్కిందని, డిజిటలైజేషన్‌లో ఏపిని అగ్రగామిగా చేయటంలో అధికారుల పాత్ర విశేషంగా ఉందని చంద్రబాబు తెలిపారు. రాబోయే కాలంలోనూ దీనిని మరింత సమర్థంగా కొనసాగించాలని సిఎం మంత్రిని ఆదేశించారు.
రాష్ట్రంలో మొబైల్ లావాదేవీలను 25 నుండి 30 శాతానికి పెంచటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలకు తలెత్తిన సమస్యలను అధిగమించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నెలలో ప్రతి నాలుగో శనివారం డిజిటల్ అక్షరాస్యత కార్యమ్రాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు జరగటానికి సిఎం అందిస్తున్న సహకారం, ముందుచూపును ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి ప్రశంసించారు. రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందటానికి కృషి చేస్తున్న అధికారులకు, అవార్డు పొందిన అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా బిజినెస్ కరస్పాండెంట్ల నియామకంపై దృష్టి సారించి పల్లెవాసుల కష్టాలు తీర్చాలన్న బాబు కోరగా, పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్ స్పందిస్తూ దీనిపై బ్యాంకర్లు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఆర్‌బిఐ నిబంధనలు వర్తించవని చెబుతున్నారని బాబు దృష్టికి తీసుకువెళ్లారు. ‘నో. మీరు ఆర్‌బిఐ నిబంధనలేమిటో చూసి నాకు చెప్పండి. మీరొకటి చెబుతున్నారు. వాళ్లొకటి చెబుతున్నారు. ఇలాగైతే సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు. రేపు దీనిపై చర్చిద్దాం. మీరు సమగ్ర సమాచారంతో రండ’ని బాబు ఆదేశించారు.
మీరూ మార్కెట్లకు వెళ్లి నాకు చెప్పండి
నగదురహిత విధానంపై మాట్లాడిన బాబు హఠాత్తుగా కలెక్టర్లకు ఒక పరీక్ష పెట్టారు. బందరురోడ్డులోని అన్ని షాపులను నగదు రహితంగా మార్చామని, మీరంతా అక్కడికి షాపింగుకు వెళ్లి మీ అనుభవాలను గురువారం నాటి సమావేశంలో నాకు చెప్పాలని నవ్వుతూ చెప్పారు.

చిత్రం... కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతున్న చంద్రబాబు