ఆంధ్రప్రదేశ్‌

బాబుకు ప్రేమతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 21: వారంతా ఇప్పటివరకూ నౌకర్లు, చాకర్లు, వాళ్లు కాకపోతే పీఏలను పురమాయించి సరకులు తెప్పించుకుంటున్నారు. అదీ కాకపోతే భార్యామణుల చేతికి డబ్బులిచ్చి కావలసినవి తెచ్చుకునేవారు. కానీ, ఇప్పుడిక డిజిటల్ యుగం వచ్చేసింది. దానికితోడు ముఖ్యమంత్రి చంద్రబాబు నగదురహిత కొనుగోలు, ఈపోస్, ఆధార్ ఆధారిత నగదు రహిత కొనుగోళ్ల విప్లవం ప్రారంభించారు. జనాలను వాటికి అలవాటుపడాలని చెబుతున్న చంద్రబాబు, తాజా కలెక్టర్ల కాన్ఫరెన్సుకు హాజరైన మంత్రులు, కలెక్లర్లను షాపింగుకు వెళ్లి వాటిని మీరూ వాడిచూసి, మీ అనుభవాలేమిటో తనకు చెప్పండని కోరటంతో బుధవారం రాత్రి వారంతా బందరురోడ్డుకు పొలోమని వెళ్లారు. ఎందుకంటే ఆ రోడ్డులోని షాపులన్నింటీనీ డిజిటలైజేషన్ చేశారు కాబట్టి! ఆ సందర్భంగా మంత్రులు, ఐఏఎస్‌లు తమ జేబునుంచి డెబిట్ కార్డులు వాడి కావలసిన సరుకులు స్వయంగా కొనుకున్నారు. ‘నేను ఎప్పుడూ ఇలా షాపులకు వచ్చి కార్డులతో కొనుక్కోలేదు. ఈ సిస్టమ్ బాగుంది. ఈ స్వీట్లను బాబుగారికి, మంత్రులకు, మీడియాకు ఇస్తా. ఈ విధానం వల్ల బ్యాగులో డబ్బులు పెట్టుకునే పని తప్పింద’ని 4600 రూపాయలతో స్వీట్‌మ్యాజిక్‌లో మిఠాయిలు కొన్న మంత్రి పరిటాల సునీత చెప్పారు. అక్కడకు వచ్చిన మంత్రి రావెలకు స్వీటు తినిపించారు. మరో మంత్రి గంటా శ్రీనివాస్, సీనియర్ ఐఏఎస్ అధికారి ఫరీదా, వ్యవసాయశాఖ డైరక్టర్ ధనుంజయరెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు కూడా స్వీట్‌మ్యాజిక్‌లోనే కొనుగోలు చేశారు. ఈవిధంగా బాబు చెప్పారు.. మంత్రులు, అధికారులు పాటించారన్నమాట! స్వీట్‌మ్యాజిక్‌లో స్వీట్లు కొన్న వాళ్లతోపాటు, వివిధ షాపుల్లో కార్డులతో వస్తువులు కొన్న మంత్రులు ‘బాబుకు ప్రేమతో’ వాటిని రేపు బహూకరించనున్నారు. ఇదీ మంత్రుల డిజిటల్ నైట్ కథ!

చిత్రం... స్వీట్లు కొనుక్కుని పరస్పరం తినిపించుకుంటున్న మంత్రులు