రాష్ట్రీయం

నీటి ప్రాజెక్టులకు నిధుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 2: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో పుష్కలంగా సాగు, తాగునీరందించడం ద్వారా ప్రజాభిమానాన్ని చూరగొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు చేపడుతున్నారు. తాజాగా కడప జిల్లాలోని వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు రూ.553కోట్లు మంజూరు చేశారు. దశాబ్దాల కాలం నుంచి ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతూ ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోవడంతో ఎలాగైనా వాటిని పూర్తిచేసి నాలుగు నెలల్లో నీరందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మరో నాలుగు మాసాల్లో పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణాకు తరలించి, శ్రీశైలం నుంచి ఈ ప్రాంతానికి నీటిని తీసుకురావడానికి ఇప్పటికే చర్యలు మొదలయ్యాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పరిశీలన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో జిల్లాకు రానున్నారు.
సీమ జిల్లాలకు గుండెకాయ లాంటి గాలేరు -నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు గత ఏడాది కంటే ఈ ఏడాది రెట్టింపు నిధులు రూ.348కోట్లు కేటాయించారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ ద్వారా ప్రతిపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులకు నీరు ఇచ్చేందుకు గండికోట ఎత్తిపోతల పథకం (పైడిపాలెం రిజర్వాయర్), పిబిసి, సిబిఆర్ కుడికాలువకు రూ.84కోట్లు కేటాయించారు. కర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు, అవుకు రిజర్వాయర్ నుంచి గండికోట, మైలవరానికి నీరు తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజి కింద రూ.200కోట్ల అనుమతులకు నివేదికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
గండికోటకు కృష్ణామిగులు జలాలు, వామికొండ రిజర్వాయర్, సర్వారాయసాగర్ రిజర్వాయర్‌లకు నీరు తీసుకొచ్చేందుకు మొదటి దశలో గత ఏడాది రూ.113కోట్లు కేటాయించారు. తెలుగుగంగ ప్రాజెక్టుకు రూ.78.12కోట్లు కేటాయించారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉండటంతో మైలవరం ప్రాజెక్టుకు నీరు తెచ్చేందుకు రూ.4.6కోట్లు మంజూరు చేశారు. మైలవరం కాలువల ద్వారా 76 గ్రామాలకు తాగునీరు, కడప ,కర్నూలు జిల్లాల్లో 70వేల 587 ఎకరాల సాగు నీరు అందించేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. జిల్లాలో వెలిగల్లు, చెయ్యేరు (అన్నమయ్య), బుగ్గవంక, సగిలేరు, ఝరికోన, కుషావతి, పింఛా ప్రాజెక్టులను ఆధునీకరణ చేసి తద్వారా తాగునీటితోపాటు సాగునీరు పుష్కలంగా ఇచ్చి సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారు.