ఆంధ్రప్రదేశ్‌

నా దగ్గర పనిచేస్తే టాప్ లెవెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 22: మన చెంతనే వున్న సాంకేతికతను ఉపయోగించుకోవాలని అందరిలో ఉండాలని, నూటికి 10 శాతం మించి మాత్రమే వారిలో వచ్చే మంచి ఆలోచనలను ఆచరణలో పెడతారని, వారు మాత్రమే వున్నత స్థాయికి చేరుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 90 శాతం మంది వారి ఆలోచనలను ఆచరణలో పెట్టకపోవటం వల్ల అంత గుర్తింపు పొందలేకపోతున్నారని తెలిపారు. తన దగ్గర పనిచేసిన ఎంతోమంది వారిలో వున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇవాళ ఐక్యరాజ్యసమితి, నాస్కామ్, యూఐడీలలో ఉన్నత స్థానాల్లో వున్నారని, కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే భవిష్యత్‌లో సాంకేతికంగా మంచి స్థానంలో వుంటారని తెలిపారు. జిల్లాలో నగదు రహిత లావాదేవీలు భారీగా జరగటానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తున్న కలెక్టర్‌ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించి, దుశ్శాలువాతో సన్మానించారు. రెండోరోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభ ప్రారంభ సమావేశంలో మంత్రులు, ఐఎఎస్ అధికారులు బుధవారం రాత్రి జరిపిన నగదు రహిత లావాదేవీలపై అడిగి వివరాలు తెలుసుకున్నారు. డిజిటల్ లావాదేవీలపై వారి అనుభవాలను, ఎదురైన సమస్యలను కూలంకుషంగా చర్చించారు. నోట్లరద్దు వల్ల ఏర్పడిన పరిస్థితులను అధిగమించటానికి కలెక్టర్ బాబు.ఎ బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించి స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానించి, ఏవిధంగా నగదు రహిత లావాదేవీలను వివిధ షాపుల్లో చేయొచ్చో ముఖ్యమంత్రికి వివరించారు. దానిపై ముఖ్యమంత్రి స్పందించి వెంటనే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కి హాజరైన మంత్రులు, అధికారులు అందరూ బయోమెట్రిక్ విధానంలో షాపింగ్ చేయాలని చెప్పారు. అందుకు అనుగుణంగా కలెక్టర్ నగరంలో 30 స్మార్ట్ ఫోన్‌లకు బయోమెట్రిక్ విధానంలో ఆధార్ అనుసంధానంతో వివిధ షాపుల్లో ఏర్పాటు చేయించారు. అక్కడికి వెళ్లి మంత్రులు, అధికారులు బుధవారం రాత్రి నగరంలో బయోమెట్రిక్ విధానంలో షాపింగ్ చేశారు. దానిపై ముఖ్యమంత్రి వారి అనుభవాలు వివరించారు. చాలా తక్కువ సమయంలో ఆధార్ అనుసంధానంతో బయోమెట్రిక్ విధానం ద్వారా చాలా సులభంగా షాపింగ్ చేయగలిగామని మంత్రులు, అధికారులు వివరించారు. ఇలా చేయటం ప్రజలు కూడా ఆసక్తిగా గమనించారని, ఇంత సులభంగా ఉంటుందని తాము ఊహించలేదని పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. గురువారం సమావేశం ప్రారంభమైన అనంతరం దీనిపై చర్చ ప్రారంభించిన ముఖ్యమంత్రి చర్చిస్తూ కొత్త సాంకేతిక పద్ధతులు అనుసరించటం వల్ల నగదు రహిత లావాదేవీలను సులభంగా చేయొచ్చని, ఎవరైనా చెపితే నమ్మబుద్ధి కాదని, ఆచరణలో చూస్తే నమ్మకం కలుగుతుందని తెలిపారు. కొత్త సాంకేతిక విషయాలను చెప్పిన వారిని ప్రోత్సహించటం వల్ల మరిన్ని కొత్త విధానాలకు అవకాశం ఏర్పడుతుందని, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా వున్న బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా దీనివల్ల ఇక్కడ అమలుచేసే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. కృష్ణా జిల్లాలో నగదు రహిత లావాదేవీలు జరగటానికి ఇప్పటికే ఈ-పోస్, రేషన్ షాపుల్లో వ్యవస్థను సమర్థవంతంగా ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ బాబు.ఎని అభినందించారు. ఆధార్ అనుసంధానంతో పేమెంట్ విధానం అన్నింటికంటే శ్రేష్ఠమైనదని చంద్రబాబు వివరించారు.
చిత్తూరు ఐటి సోదాల్లో
భారీగా నగదు, పత్రాలు స్వాధీనం?
టిడిపి శ్రేణుల్లో ఆందోళన

చిత్తూరు, డిసెంబర్ 22: చిత్తూరు నగరానికి చెందిన టిడిపి నేత, తమిళనాడు మాజీ సిఎస్ రామ్‌మోహన్‌రావు వియ్యంకుడు అయిన బద్రినారాయణ ఇంట్లో బుధవారం రాత్రంతా కొనసాగిన ఐటి సోదాల్లో భారీగా నగదు, నగలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. చెన్నైకు చెందిన ఐటి అధికారులు బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువ జాము వరకు రెండు బృందాలుగా సుమారు 20గంటల పాటు బద్రినారాయణ ఇంటిలో సోదా చేపట్టారు. బుధవారం చెన్నైలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్‌మోహన్‌రావు ఇంట్లో ఐటి దాడులు జరిగిన నేపథ్యంలో చిత్తూరులో కూడా ఆయన వియ్యంకుడు ఇంట్లో సోదాల పరంపర కొనసాగింది. బద్రినారాయణ అల్లుడు, తమిళనాడు సిఎస్ రామ్‌మోహన్‌రావు కుమారుడైన వివేక్‌కు తమిళనాడులోని తిరుమల, తిరుపతి దేవస్థానం, పాలక మండలి మాజీ సభ్యుడైన జె శేఖర్‌రెడ్డి మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఇటీవల శేఖర్‌రెడ్డి నివాసంతోపాటు పలుప్రాంతాల్లో ఆయన వ్యాపార లావాదేవీలపై ఐటి అధికారులు దాడులుచేసి భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివేక్‌పై కూడా ఐటి అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే చిత్తూరులోని ఆయన మామ, టిడిపినేత బద్రినారాయణ ఇంట్లో చెన్నైకు చెందిన ఐటి అధికారులు ఈదాడులు కొనసాగించారు. సుమారు 20గంటల పాటు చిత్తూరులో ఐటి అధికారుల సోదాలు జరిపి భారీగా బంగారు నగలతో పాటు నగదును ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. భారీ భద్రత మధ్య గురువారం వేకువ జామున ఐటి అధికారులు చెన్నైకు తరలించారు. వివరాలను చెన్నైలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాడులు నేపథ్యంలో చిత్తూరులోని బివిరెడ్డి కాలనీలో పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు నిర్వహించారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం వేకువ జామున వరకు ఈ బందోబస్తు కొనసాగింది. అయితే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వరుసగా అధికార పార్టీకి చెందిన నేతలపై ఐటి అధికారులు దాడులు చేయడంతో నేతల్లో ఆందోళన నెలకొంది. రెండు నెలల క్రితం చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటితో పాటు బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో వారి వ్యాపార సంస్థలపై మూకుమ్మడిగా ఐటి అధికారులు దాడులు నిర్వహించి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పెద్దనోట్లు రద్దు అయిన తరువాత టిడిపికి చెందిన పెద్ద పంజాణి జడ్పిటిసి సులోచన ఇంటిపైన, వారి వ్యాపార సంస్థలపై ఐటి దాడులు కొనసాగాయి.
3న తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ సదస్సు
తిరుపతి, డిసెంబర్ 22: తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో జనవరి 3 నుంచి 7 వరకు జరుగనున్న 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ మూడవ తారీఖున ప్రారంభిస్తారని ఇస్కా జనరల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డి. నారాయణ రావు తెలిపారు. గురువారం స్థానిక ప్రైవేటు హోటల్‌లో విలేఖరులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇస్కా సదస్సుకు దేశ విదేశాల నుంచి వివిధ విశ్వవిద్యాలయలకు, విద్యా సంస్థల నుంచి సుమారు 13వేల మంది శాస్తవ్రేత్తలు హాజరుకానున్నారన్నారు. అంతేకాకుండా ఆచార్యులు, పరిశోధనా వేత్తలు అందరూ ఒక వేదికపై కలుస్తారన్నారు. ముఖ్యంగా భారత ప్రభుత్వానికి చెందిన శాస్ర్తియ పరిపాలనా వేత్తలు చురుగ్గా పాల్గొంటున్నారన్నారు. ఈ సదస్సు దేశంలోని శాస్ర్తియ పరమైన భవిష్యత్ ప్రణాళికకు బీజం వేస్తుందన్నారు. అంతేకాకుండా సదస్సులో ప్రజా ఉపన్యాసాలు, సంపూర్ణ ఉపన్యాసాలు, సామూహిక చర్చలతో పాటు అనేక విశిష్టమైన అంశాలపై సమావేశం ఉంటుందన్నారు. ప్రధానంగా జాతీయాభివృద్ధిలో శాస్ర్తియత, సాంకేతికత అన్న అంశంపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారిస్తుందన్నారు. ఈక్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి 9 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు హాజరవుతున్నారన్నారు. యుఎస్‌ఎకు చెందిన ప్రొఫెసర్ విలియం ఇ మోర్నర్ , జపాన్ నుంచి ప్రొఫెసర్ టకాకీ కజిత, ఫ్రాన్స్ నుంచి ప్రొఫెసర్లు సెజ్ హరోచి, జీన్ టిరోలి, ఇజ్రాయిల్ నుంచి అడా ఇ యోనాత్, బంగ్లాదేశ్ నుంచి మహ్మద్ యూనస్, అమెరికా నుంచి కొబిల్కా బ్రెయిన్‌కెంట్, స్టీవెన్ చు, డేవిడ్ జోనాథన్ హాజరువుతున్నారన్నారు. ఎస్వీయూనివర్సిటీలో మహిళా సైన్స్ కాంగ్రెస్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 31న ఉదయం 8 గంటలకు సైన్స్ కాంగ్రెస్ ర్యాలీని 3వేల మంది విద్యార్థులతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఐదురోజుల్లో ప్రధానంగా ఆహార భద్రత, సౌరశక్తి, ఫోటో ఓల్టాయిక్, టెర్మల్, బ్లూ ఎకనామిక్-్భరతీయ కృషి, డిజిటల్ ఇండియా స్మార్ట్ సిటీలు, సైబర్ సెక్యూరిటీ, స్వచ్ఛ్భారత్, సైన్స్ విద్యా పరిశోధనా జినోమ్ ఎడిటింగ్ , హ్యూమన్ మైక్రోబయోమి, గ్రావిటేషనల్ వేవ్స్ (లిగోఅండ్ లిర్గో), భారతీయ నైరుతీ ప్రాంతాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ , అనేక అంశాల్లో సమగ్ర చర్చ నిర్వహిస్తామన్నారు.
సింగరేణికి నిరసనల సెగ!

ఖమ్మం, డిసెంబర్ 22: తెలంగాణ జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కాలరీస్ సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిరసనల మధ్య జరగనున్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో శుక్రవారం ‘సింగరేణి డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం కార్మిక, కార్మికేతర సంఘాలు వేరువేరుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో ధర్నాలు, ప్రదర్శనలతో పాటు నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో నిరవధిక నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న క్రమంలోనే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సింగరేణి సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. బొగ్గు గనులకు జన్మనిచ్చిన ఇల్లెందులో కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు జెఎసిగా ఏర్పడి కొత్త బొగ్గుగనులు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం పనిచేస్తున్న మైన్ కాలపరిమితిని పెంచాలని కోరుతూ నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. నెలరోజులుగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా దీక్షలు కొనసాగించారు. సింగరేణి డే కార్యక్రమాన్ని అడ్డుకునే యోచనలో ఆ సంఘాల నేతలున్నారు.ఉద్యోగ భద్రత, వేతనాల పెంపుదల కోసం కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మణుగూరు ఏరియాలో ఓపెన్‌కాస్ట్ విస్తరణ ప్రాంత నిర్వాసిత కుటుంబాలు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి ఏరియాలో సైతం ఇదే తరహా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇతర జిల్లాల్లోనూ తమ డిమాండ్ల సాధన కోసం ఆయా ప్రాంత కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఒకవైపు నిరసన కార్యక్రమాలు, మరోవైపు నిరవధిక ఆందోళనల నేపథ్యంలో వేడుకలు విజయవంతం చేసే పనిలో అధికారులు ఉన్నారు.