రాష్ట్రీయం

జల సంరక్షణలో ఏపి భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 2: రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోనున్న జలవనరులను సమర్థవంతంగా వినియోగించుకోడానికి ఆర్థిక చేయూత నందించాల్సిందిగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం నాడిక్కడ తన కార్యాలయాన్ని సందర్శించిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందాన్ని కోరారు. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి చాన్‌జిల్ జూన్ నాయకత్వంలో బికెడి రాజా, ఎస్‌కె జైన్, పి.శ్రీనివాసరావు గత నెల 30 నుంచి వివిధ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి మంత్రి దేవినేనితో భేటీ అయ్యారు. నీటి వినియోగదారుల సంఘాలు, పంపిణీ విభాగాల పనితీరు ఎంతో భేష్‌గా ఉందంటూ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రశంసించారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించగల్గుతున్నారన్నారు. అయితే భూగర్భ జలాల స్థాయిని పెంచడంతో పాటు నైపుణ్యాభివృద్ధిపై కూడా దృష్టి సారించాలన్నారు. హెక్టార్ భూమి సాగులోకి తీసుకురావడానికి ఎత్తిపోతల పథకానికి 4వేల 350 డాలర్లు ఖర్చయితే, నూతన విధానాల అమలు ద్వారా వెయ్యి నుంచి రెండువేల డాలర్లకే పరిమితం కావచ్చన్నారు. ఆపరేషన్ నిర్వహణా విధానం, తదుపరి చేపట్టాల్సిన నిర్వహణా ఖర్చులు వంటి వాటిపై పూర్తి స్పష్టతతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. సంస్థాగత నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర డిస్ట్రిబ్యూటరీ కమిటీ సభ్యులు ఆళ్ల గోపాలకృష్ణ మాట్లాడుతూ బృందం గోపాలపురం, తాడిపూడి, పట్టిసీమ ఎత్తిపోతల పథకాలతో పాటు కృష్ణాజిల్లాలో విస్సన్నపేట వరకు దాదాపు 170 కిమీ పర్యటించి పరిశీలించిందన్నారు. భూగర్భ జలాల డెప్యూటీ డైరక్టర్ ఎ.వరప్రసాదరావు మాట్లాడుతూ 1966లో 22 మీటర్ల లోతులో లభ్యమయ్యే భూగర్భ జలాలు 2016 నాటికి 80 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయని అయితే గోదావరి జలాల తరలింపు వల్ల స్వల్ప వ్యవధిలోనే 1.5 మీటర్ల భూగర్భ జలాల స్థాయి పెరిగిందన్నారు.