ఆంధ్రప్రదేశ్‌

ఫ్రతిష్ఠాత్మకంగా స్వాస్థ్య వైద్య వాహిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబరు 24: గ్రామస్థాయి నుండి ప్రతిఒవొక్కరికీ ఆరోగ్య విజ్ఞానాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వాస్థ్య వైద్య వాహిని కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తోందని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో శనివారం స్వాస్థ్య వైద్య వాహిని కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థిరమైన అభివృద్ధి లక్ష్యంగా ప్రజలందరికీ ఆహారం, విద్య, వైద్యం, సంక్షేమాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ, చంద్రన్న సంచార చికిత్స, ఉచిత ఎక్స్‌రే, సిటీ స్కాన్ పరీక్షలు, డయాలసిస్, మాస్టర్ హెల్త్ చెకప్, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్ వంటి ఆరోగ్య కార్యక్రమాలను అమలుచేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజలు కూడా అవగాహనతో చైతన్యవంతులైతే తప్ప ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధ్యం కాదన్నారు. చికిత్స కన్నా నివారణే మిన్న అనే వౌలిక సూత్రానికి అనుగుణంగా వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. స్వాస్థ్య విద్యా వాహిని కార్యక్రమం క్రింద వైద్య, దంత వైద్య, నర్సింగ్, హోంసైన్స్ విద్యార్థులతో నలుగురు వంతున బృందాలు ఏర్పాటుచేసి వారి ద్వారా ప్రజలకు ఆరోగ్య సమాచారాన్ని అందిస్తామన్నారు. నెలకొక ఆరోగ్య అంశాన్ని చేపట్టి 10 నెలల పాటు ఈ విద్యార్థి బృందాలు ప్రజలకు ఆయా అంశాలపై అవగాహన కలిగిస్తాయని చెప్పారు. శరీరం, చేతుల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, అంటు వ్యాధులు, రక్తహీనత నివారణ, పునరుత్పత్తి ఆరోగ్యం, సమీకృత ఆహారం, వ్యాయామం, దీర్ఘకాలిక వ్యాధులు తదితర అంశాలపై ముందుజాగ్రత్త చర్యలను వివరించడం, ఆరోగ్య విజ్ఞానాన్ని వివరించి, ప్రజలు వాటిని ఆచరించేలా చైతన్య పరచడం చేస్తారన్నారు. ఇందుకు అవసరమైన శిక్షణ, వాహనాలు, భత్యాలను కల్పిస్తారని చెప్పారు.

5 లక్షల మందితో విశాఖలో బిసి గర్జన
విశాఖపట్నం, డిసెంబర్ 24: వెనుక బడిన వర్గాల సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో విశాఖ వేదికగా 5 లక్షల మందితో బిసిల గర్జన సభ నిర్వహించనున్నట్టు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. విశాఖ వైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో శనివారం జరిగిన బిసి సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రులు కేంద్రాన్ని ఒప్పించి తమకు బిసిలపై ఉన్న ప్రేమను చాటుకోవాలని సూచించారు.