ఆంధ్రప్రదేశ్‌

జానీమూన్ యూ టర్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 25: ‘తొందరలో పొరపాటుపడ్డా.. మా ఇంటికి వచ్చింది మంత్రి రావెల కిషోర్‌బాబుకు చెందినవారు కాదని తెలిసింది.. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.. ఇకపై అందరం కలిసి పనిచేస్తాం’.. అంటూ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జానీమూన్ సెలవిచ్చారు. మంత్రి రావెలపై ఆరోపణలు సంధించి, మీడియా ఎదుటే కన్నీరు పెట్టుకున్న జానీమూన్.. మంత్రులతో జరిపిన చర్చల అనంతరం ఆదివారం యూ టర్న్ తీసుకున్నారు. రావెల, జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ మధ్య తలెత్తిన వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటవెంటనే పావులు కదిపారు. వివాదాన్ని పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. వారు తక్షణం రంగంలోకి దిగి ఇద్దరినీ కూర్చోబెట్టి చర్చలు జరిపి, సమస్య సద్దుమణిగేలా చేయడం చకచకా జరిగిపోయాయి. కాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏర్పాటు చేసిన కమిటీలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత కిమిడి కళావెంకట్రావు, చినరాజప్ప, జివి ఆంజనేయులుతో కమిటీ వేసినప్పటికీ కళావెంకట్రావు, చినరాజప్ప స్థానంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథరెడ్డి చర్చల్లో పాల్గొన్నారు.
ఆదివారం గుంటూరులోని జిల్లా టిడిపి కార్యాలయంలో వీరు మంత్రి రావెల, జెడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్‌తో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేసి తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, అంతా కలిసి పనిచేస్తామని ప్రకటించారు. తొలుత జానీమూన్ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకముందని, వారి నిర్ణయాన్ని శిరసావహిస్తానని చెప్పారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను మండలంలో సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి రావెల హామీ ఇచ్చారన్నారు. తాము ఇకపై కలిసే పనిచేస్తామన్నారు. మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ ‘మా మధ్య అపోహలు, అభిప్రాయ భేదాలు, సమస్యలు చాలా చిన్నవి.. సమయాభావంవల్ల నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించలేకపోయాను.. ఇకపై నియోజకవర్గంలోని పార్టీ నేతలందరినీ ఏకతాటిపై నడిపిస్తా’ అని చెప్పారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న జానీమూన్, రావెల