ఆంధ్రప్రదేశ్‌

వాజపేయి స్ఫూర్తితో సుపరిపాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 25: భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో ఊరూ వాడా సుపరిపాలన విస్తరిస్తోందని కేంద్ర సమాచార ప్రసార పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. గత 70 ఏళ్లుగా బడాబాబుల వద్ద పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికితీసేందుకే కాదు ఇదే సమయంలో దేశ ప్రజల బంగారు భవిష్యత్ కోసమే మోదీ సాహసంతో పెద్ద నోట్లను రద్దు చేసారన్నారు. ఈ పరిణామం తాత్కాలికంగా కొందరిని ఇబ్బందుల పాలుచేసినా నూతన సంవత్సరం ఆరంభం నుంచి నల్లధనం కుబేరులకు చుక్కలు చూపిస్తామన్నారు. బ్యాంకుల్లో మోసాలు, అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఏరోజుకారోజు నోట్లు ఎంత నిలువ ఉన్నాయో అందరికీ తెలియజేసేలా బోర్డుపై రాయించే ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు గాను ఇక పార్కింగ్ సదుపాయం ఉన్నవారికే కారు రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. వాజపేయి జన్మదినం సందర్భంగా బిజెపి రాష్టశ్రాఖ ఆధ్వర్యంలో ఆదివారం నాడిక్కడ ఓ ఫంక్షన్ హాలులో జరిగిన సుపరిపాలన దినోత్సవ సభలో వెంకయ్యనాయుడు ప్రసంగించారు. సభకు రాష్ట్ర నేత ఉప్పలపాటి శ్రీనివాసరాజు అధ్యక్షత వహించారు. భారతదేశంలో తొలి కాంగ్రెసేతర ప్రధాన మంత్రి 23 పార్టీలతో ఐదేళ్లపాటు నిజాయితీగా అభివృద్ధి పథంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన వాజపేయి అందరికీ స్ఫూర్తిదాయకుడని అన్నారు. సామ్రాజ్యవాద దేశాల బెదిరింపులకు భయపడి అణుబాంబు గురించి బయట ప్రపంచానికి తెలియజేయని భారత నాయకులకు భిన్నంగా అణుబాంబును పరీక్షించి ధైర్యసాహసాలు గల నాయకునిగా నిలిచారని అన్నారు.
ప్రస్తుత మీడియా వ్యవహారశైలిని ప్రస్తావిస్తూ తాను కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అయినప్పటికీ తాను మాట్లాడిన అంశాలపై ప్రసారం చేయని, ప్రచురితం చేయని పత్రికలనేకం వున్నాయని అంటూనే, మీడియా స్వేచ్ఛకు తాను ఎప్పుడూ అడ్డుపడబోనన్నారు. ముందుగా పశ్చిమ నియోజకవర్గంలో వెంకయ్యనాయుడు పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, పేదలకు దుప్పట్లు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేసారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు