ఆంధ్రప్రదేశ్‌

బాబు చెప్పినా బేఖాతర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 26: ముఖ్యమంత్రి ఆదేశమంటే శిలాశాసనం. అయితే ఇందుకు భిన్నంగా ఆయన ఆదేశాలనే బేఖాతరు చేస్తూ, వెలగపూడి సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లు ప్రజల్ని వెక్కిరిస్తున్నాయి. తాత్కాలిక సచివాలయాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతిరోజూ సచివాలయానికి వస్తున్నారు. వివిధ సమస్యల పరిష్కారానికి వచ్చే సందర్శకులకు మంత్రులు అందుబాటులో ఉండాలని ఆయన భావించి, ప్రతి శుక్రవారం సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రులను తొలుత ఆదేశించారు. సచివాలయంలో అందరికీ ఛాంబర్లు కేటాయించినప్పటికీ శుక్రవారం అరకొరగా మాత్రమే మంత్రులు వస్తున్నారు. మంత్రివర్గ ఉప సంఘ సమావేశాలు, ఇతర సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే శుక్రవారం వస్తున్నారు. దీంతో మంత్రులు ఎప్పుడు వస్తారో తెలియక సందర్శకులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వస్తారని ఎదురుచూసి వెనుదిరగాల్సి వస్తోంది. సచివాలయానికి మంత్రులు ఎప్పుడు వస్తారో తెలియకపోవడంతోపాటు విభాగాధిపతుల కార్యాలయాలు పలు ప్రాంతాల్లో ఉండటం కూడా సందర్శకులను ఇక్కట్లకు గురిచేస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో వారంలో రెండ్రోజులు సచివాలయంలో మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సోమ, శుక్రవారాల్లో మంత్రులు వెలగపూడిలో ఉండాలన్నారు. ఆయన ఆదేశించిన తరువాత తొలి సోమవారం యనమల, నారాయణ, గంటా, పత్తిపాటి పుల్లారావు, రాఘవరావు, మృణాళిని, కామినేని మాత్రమే వచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రులు అందరూ అందుబాటులో ఉంటారని వచ్చిన సందర్శకులు ఇబ్బందులకు గురయ్యారు. సోమ, శుక్రవారాల్లో మంత్రులు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ కొందరు మంత్రులు మాత్రం సచివాలయంలో గురు, శుక్రవారాల్లో ఉంటామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాల్లో సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు కూడా అందుబాటులో ఉండనప్పుడు ఇక్కడ రెండ్రోజులు తాము ఉండటం వల్ల ఉపయోగం ఏమిటనే అభిప్రాయాన్ని కొందరు మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మార్పులతో ఇంకా ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు జారీకాని నేపథ్యంలో సోమవారం కూడా తక్కువ సంఖ్యలోనే మంత్రులు సచివాలయానికి రావడం గమనార్హం.