ఆంధ్రప్రదేశ్‌

నీళ్లెలా వస్తాయి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 26: పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీళ్లు ఏ విధంగా వస్తాయో ముఖ్యమంత్రే చెప్పాలని వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టిసీమ నీరు ప్రకాశం బ్యారేజికి తరలిస్తే అవి కాస్తా సముద్రం పాలయ్యాయన్నారు. ప్రాజెక్టులకు టెంకాయలు కొట్టడమే ముఖ్యమంత్రికి చేత నవుతుందని ఎద్దేవాచేశారు. కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి తాగు, సాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం పులివెందుల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన జగన్ మాట్లాడుతూ తాగేందుకు నీళ్లు లేక ఈ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. సాగునీరు అందక పండ్లతోటలు తమ కళ్లెదుటే ఎండుతున్నాయని రైతులు వాపోతున్నారన్నారు. రాయలసీమకు నీళ్ల పేరిట పట్టిసీమకు రూ.1300 కోట్లు వృథాగా ఖర్చుపెట్టారన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు నిర్మాణానికి నోచుకోకుండా అర్థంతరంగా నిలిచిపోయాయన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తలా తోకా లేకుండా పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. తన తండ్రి రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన అనేక ప్రాజెక్టుల నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయన్నారు. వాటి గురించి బాబు పట్టించుకున్న దాఖలాలులేవని ధ్వజమెత్తారు. గాలేరు-నగరి, హంద్రీ-నీవాకు బాబు రూ.30 కోట్లు మాత్రమే ఖర్చుచేశారన్నారు. అదే వైఎస్ హయాంలో రూ.4 వేల కోట్లు ఖర్చుపెట్టి 80 శాతం పనులు పూర్తిచేశారని గుర్తుచేశారు. బాబుకే చిత్తశుద్ధి ఉండిఉండే పనులు త్వరితగతిన పూర్తిచేసి ఈ ప్రాంతానికి నీరిచ్చేవారన్నారు. అయినా బాబు అభివృద్ధిపై గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. గండికోట ప్రాజెక్టు కింద 22 గ్రామాలు ముంపునకు గురికాగా, తొలిదశలో 14 గ్రామాలు ఉండగా, ప్రస్తుతం మూడు గ్రామాలు మునకదశకు చేరాయన్నారు. ప్రత్యేక ప్యాకేజి కింద నాడు తన తండ్రి బాధితులకు పరిహారం ప్రకటించారన్నారు. ప్రస్తుతం ఆప్రాంత ప్రజలు నీళ్లలో మునిగిపోతున్నా ప్రభుత్వానికి కనికరం లేదని ధ్వజమెత్తారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ, నష్టపరిహారం ఇంతవరకు రైతలకు అందజేయలేదన్నారు. రబీలో రైతుల పంట సాగుకు రూ.34 వేల కోట్ల రుణాలు ఇవ్వాల్సివుండగా, ఇప్పటివరకు రూ.4500 కోట్లు మాత్రమే ఇచ్చారని అన్నారు. ధర్నాలో ఎంపిలు అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. కడప జిల్లా పులివెందుల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలో ప్రసంగిస్తున్న వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి