ఆంధ్రప్రదేశ్‌

అన్ని జిల్లాల్లో ‘ఐ’ క్లిక్‌లు: డిఐజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 27: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ‘ఐ’ క్లిక్‌లు త్వరలో ఏర్పాటు చేయనున్నట్టు డిఐజి సిహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘ఐ’ క్లిక్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. మంగళవారం పోలీసు జూనియర్ గెస్ట్ హౌస్, స్మృతివనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఐ’ క్లిక్‌లు ఏర్పాటు చేయడం వల్ల బాధితులు పోలీసు స్టేషన్లకు వెళ్లకుండానే ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. విశాఖ, మల్కన్‌గిరి ప్రాంతాల్లో మావోలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అయితే మావో ప్రభావిత ప్రాంతాల్లో ‘ముందడుగు’ వంటి కార్యక్రమాలతో గిరిజనుల్లో అవగాహన కల్పించడం, యువతకు ఉపాధి కల్పించడం ద్వారా ఉద్యమం పట్ల వారిలో విముఖత ఏర్పడిందన్నారు. గిరిజనులను పట్టణాలకు తీసుకెళ్లి అక్కడ జీవనశైలి, ఉపాధి అవకాశాలను వివరించడం వల్ల సత్ఫలితాలు కలుగుతున్నాయన్నారు. పాడేరు ఎఎస్పీ శశికుమార్ ఆత్మహత్యపై సిబిసిఐడి విచారణ కొనసాగుతుందన్నారు. ఎస్పీ ఎల్‌కెవి రంగారావు, ఒఎస్‌డి అప్పలనాయుడు, డిఎస్పీలు పాల్గొన్నారు.