ఆంధ్రప్రదేశ్‌

ఇక అన్నీ డిజిటల్ గ్రామాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, డిసెంబర్ 29: రాష్ట్రంలోని గ్రామాలన్నిటినీ దశలవారీగా డిజిటలైజ్ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిజిటలైజేషన్ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతోపాటు ప్రపంచం మొత్తం మన ముంగిట్లోకి వస్తుందన్నారు. సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఫైబర్‌గ్రిడ్‌ను గురువారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం మోరిలో రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మారుతున్న అవసరాల దృష్యా ఆధునిక, సాంకేతిక సదుపాయాలను సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తేవడానికి భారతదేశంలో తొలిసారిగా మోరి, మోరిపోడు గ్రామాలను స్మార్ట్ విలేజీలుగా ప్రకటించి, ఫైబర్ గ్రిడ్ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. దేశ చరిత్రలో ఒక కుగ్రామానికి సిలికాన్ వ్యాలీ స్థాయిలో సౌకర్యాలు కల్పించడం తమ ప్రభుత్వం సాధించిన ఘనత అన్నారు. దేశంలోని నల్లధనాన్ని బయటికి
తేవడానికి కేంద్ర ప్రభుత్వం 1000, 500 రూపాయిల నోట్లను రద్దు చేసిందని, దీనివల్ల ప్రజలు కొంత మేర ఇబ్బంది పడిన మాట వాస్తవమేనని, ఆ ఇబ్బందిని అధిగమించడానికే నగదు రహిత లావాదేవీలను ప్రవేశపెట్టామన్నారు. ఈ అంశాన్ని కూడా స్మార్ట్ విలేజ్‌లైన మోరి, మోరిపాడు నుండే ప్రారంభిస్తున్నామన్నారు. ఈ రెండు గ్రామాల్లోని ప్రజలకు నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి సెల్‌ఫోన్లు, రూపే, మాస్టర్, విసా కార్డులు పంపిణీచేసి, వాటిని ఉపయోగించడంలో కూడా శిక్షణ ఇచ్చామన్నారు. ఈసందర్భంగా బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా మోరిని ప్రకటించామన్నారు. ఫైబర్ గ్రిడ్ ఏర్పాట్లుకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.330 కోట్లు ఖర్చుచేశామన్నారు.

చిత్రం..డిజిటల్ తరగతుల ప్రారంభం సందర్భంగా బెలూన్లు విడిచిపెడుతున్న చంద్రబాబు నాయుడు