ఆంధ్రప్రదేశ్‌

పోలవరంలో మరో మైలురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, డిసెంబర్ 29: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో శుక్రవారం మరో ప్రతిష్ఠాత్మక అడుగు పడనుంది. ప్రధాన నిర్మాణమైన స్పిల్‌వే పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అంగరంగ వైభవంగా పోలవరం పండుగ రీతిలో కాంక్రీట్ పనులను ప్రారంభించనున్నారు. 1941లో రామపాదసాగర్ ప్రాజెక్టుగా ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు వ్యవహారం ఆ తర్వాత పరిణామాల్లో అధ్యయనాలు, సర్వేలు వంటి దశలను దాటుకుంటూ వచ్చింది. అప్పటినుంచి అధికారంలోకి వచ్చిన ప్రతిపార్టీ, ప్రతి నేత ఈ పోలవరం ప్రాజెక్టును మరచిపోకుండా తమ హయాంలో ఒక కొలిక్కి తీసుకువస్తామంటూ హామీలు ఇస్తూనే వచ్చారు. చివరకు 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రధాన ప్రాజెక్టు కాల్వ పనులను ముందుకు తీసుకువెళ్లారు. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన నిర్మాణాల్లో సగం పూర్తయినట్లే అయ్యింది. అయితే ఆ తర్వాత కూడా ప్రధాన నిర్మాణానికి సంబంధించి వివాదాలు సాగుతూనే వచ్చాయి. చివరకు రాష్ట్ర విభజన సందర్భంగా ఈ ప్రాంతానికి పోలవరాన్ని వరంగా ఇస్తున్నట్లు పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చారు. ఫలితంగా ఈ ప్రాజెక్టుకు అప్పటిదాకా దక్కని జాతీయ హోదా లభించేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌లోనూ నిధుల విదిలింపు తప్ప పనులు ముందడుగు పడేలా నిధులు విడుదల చేయలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో చివరకు ప్రత్యేక ప్యాకేజీలో దీన్ని పొందుపర్చడమే కాకుండా నాబార్డు ద్వారా ప్రాజెక్టు వ్యయాన్ని రుణంగా అందించి ఆ మొత్తాన్ని కేంద్రం చెల్లించేలా ఒక విధానాన్ని ఖరారు చేశారు. దానిలో భాగంగానే ప్రాజెక్టుకు తొలి విడత నిధులు మంజూరు అయ్యాయి. వెనువెంటనే స్పిల్‌వే పనులకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి తదితరులు శ్రీకారం చుట్టనున్నారు.
ఈ ప్రాజెక్టు కింద 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. గోదావరి నుంచి కృష్ణా నదికి 80 టిఎంసిల నీటిని మళ్లించే అవకాశాలు స్పష్టమవుతాయి. అలాగే 7.2 లక్షల హెక్టార్లకు సాగునీరును అందించే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు స్పిల్‌వేను 1128.4 మీటర్ల మేర నిర్మించి 16న20 మీటర్ల విస్తీర్ణంతో రేడియల్ గేట్లను ఏర్పాటు చేస్తారు.
కాంక్రీటు పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రభుత్వం భారీ ఎత్తున జనసమీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ, స్కూలు బస్సులన్నింటిని శుక్రవారం పోలవరంకు తరలించేందుకు చర్యలు తీసుకుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని అధిక శాతం మంది విద్యార్థులను పోలవరం పండుగలో భాగస్వాములను చేయనుంది.