ఆంధ్రప్రదేశ్‌

సత్తుపల్లి జిల్లా కోసం సుదీర్ఘ ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 29: సత్తుపల్లి జిల్లా ఏర్పాటు కోరుతూ గత రెండు నెలలుగా సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల ప్రజలు అలుపెరుగని ఆందోళన జరుపుతున్నారు. రెండు నెలలుగా ఉపాధ్యాయులు, న్యాయవాదులు, వ్యాపారులు, రైతులు, విద్యార్థులు జిల్లా ఏర్పాటును కాంక్షిస్తూ ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం పట్ల ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సత్తుపల్లి అవిభాజ్య ఖమ్మం జిల్లా రాజకీయాలకు కేంద్రంగా ఉంటూ వస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సత్తుపల్లి కేంద్రంగా రాజకీయాలు చేసుకొని ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఇక్కడే రాజకీయ ఓనమాలు దిద్దుకొని సత్తుపల్లిని పునాదిగా చేసుకొని ఉన్నత పదవులు పొందారు. వీరంతా తమ పార్టీలో కీలకమైన నేతలుగా గుర్తింపు తెచ్చుకున్నా సత్తుపల్లిని జిల్లా కేంద్రం చేయడంలో విఫలమయ్యారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లాల పునర్విభజన కమిటీలో సభ్యుడిగా ఉన్నప్పటికీ సత్తుపల్లి జిల్లా అంశం కమిటీ పరిశీలనలో కూడా నోచుకోకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒక్కసారి కూడా ఈ అంశాన్ని ఎవరికీ నివేదించలేదు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ ఈ సమస్య తనది కాదన్నట్లు, కొత్తగూడెం జిల్లా ఏర్పాటుపై దృష్టి సారించి అందులో విజయం సాధించారు. ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట వినేవారే లేరన్నట్లుగా ఉన్నారు. సత్తుపల్లిని పునాదిగా చేసుకొని రాజకీయంగా ఎదిగిన వీరంతా తమ గొప్పలు చెప్పుకుంటూ పోవడం తప్ప కార్యాచరణకు వచ్చేసరికి దూదిపింజల్లా తేలిపోయారు. అయితే ఇంతకాలం తామంతా ఎంతో గొప్పవాళ్ళుగా భావించిన మంత్రులు, ఎమ్మెల్యేల వలన జిల్లా ఏర్పాటు జరగదన్న విషయానికి వచ్చిన ప్రజలు సుదీర్ఘకాల ఉద్యమానికి సమయత్తమయ్యారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నాయకులంతా సత్తుపల్లి నియోజకవర్గంవారే అయినప్పటికీ వారు ఈ డిమాండ్‌ను పట్టించుకోకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సత్తుపల్లి పట్టణ, మండల జనాభాను కలుపుకొని రెండు లక్షలుగా ఉంది. ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్ పట్టణ జనాభాతో సత్తుపల్లి పట్టణ జనాభా దాదాపు సమానంగా ఉంది. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకంటే ప్రతిపాదిత సత్తుపల్లి జిల్లా జనాభా రెండు, మూడురెట్లు ఎక్కువగా ఉంటుంది. సత్తుపల్లి డివిజన్‌లో అంతర్భాగంగా ఉండే అశ్వారావుపేట, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు కలిపితే జనాభా 13లక్షలకు లెక్క చేరింది. ప్రాధాన్యత పరంగా సత్తుపల్లి పట్టణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖద్వారంగా ఉంది. విద్యాపరంగా మూడు ఇంజనీరింగ్ కాలేజీలు, రెండు బిఇడి, ఐదు పిజి కళాశాలలు ఉన్నాయి. వౌలిక సదుపాయాల పరంగా, వ్యవసాయపరంగా సత్తుపల్లి ప్రతిఏటా పురోగమనంలో ఉంది.