ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన పక్షుల పండగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట/తడ, డిసెంబర్ 29: సూళ్లూరుపేటలో మూడు రోజుల నుండి జరుగుతున్న పక్షుల పండుగ సంబరాలు గురువారంతో ఘనంగా ముగిసాయి. సూళ్లూరుపేట, నేలపట్టు, బివిపాళెం వేదికగా మంగళవారం నుండి ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభమైంది. తొలిరోజు జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు సూళ్లూరుపేట జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసి స్టాల్స్ సందర్శకులతో కిక్కిరిసాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతోగానో అలరించాయి. సినీ సంగీత గాయకులు, టివి యాంకర్లు, జబర్ధస్త్ నటులు, ఆలీతో జాలిగా తదితర కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. సుదూర ప్రాంతాలనుంచి కూడా పర్యాటకులు అధికంగా విచ్చేయడంతో మూడు రోజుల పాటు సూళ్లూరుపేటలో పండగ వాతావరణం కనపడింది. గురువారం రాత్రి జరిగిన ముగింపు సభలో రాష్ట్ర మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణతదితరులు పాల్గొని ప్రసంగించారు. పర్యాటకానికి రాష్ట్రప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో లేపాక్షి,విశాఖ,కడప ఉత్సవాలు,కాకినాడ బీచ్ ఫెస్టివల్ వంటి పండుగలు నిర్వహించి కోట్లాది నిధులతో ఆ ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు.